దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరి

NIA Court Sentenced Death For Accused People Of 2013 DilsukhNagar Bomb Blasts

10:49 AM ON 20th December, 2016 By Mirchi Vilas

NIA Court Sentenced Death For Accused People Of 2013 DilsukhNagar Bomb Blasts

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ళ కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం నిందితులకు శిక్ష ఖరారు చేసింది. మూడున్నర ఏళ్ళుగా ఈ కేసు విచారణ సాగింది. నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, జివుర్ రెహ్మాన్, మహ్మద్ తహసీన్ అక్తర్, అజాజ్ షేక్ లను కోర్టు దోషులుగా ప్రకటించింది. ఈ ఐదుగురు దోషులకు మరణశిక్ష విధిస్తున్నట్లు ఎన్ఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే బాధిత కుటుంబాలకు సరైన నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. తీర్పు కాపీని హైకోర్టుకి పంపింది ఎన్ఐఏ కోర్టు.. ఈ తీర్పుని హైకోర్టు నిర్ధారించాకే శిక్ష అమలు చేయనుంది. ఎ-1 నిందితుడిగావున్న రియాజ్ భత్కల్ ఇంకా పరారీలో ఉన్నాడు.

2013, ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో 19 మంది మృత్యువాత పడగా... 131 మంది గాయపడ్డారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో ఎన్ ఐఏ అధికారులు మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 502 ఫైల్స్ , 201 వస్తువులను ఆధారంగా సమర్పించారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతడు పాకిస్థాన్ లో ఉన్నట్లు గట్టిగా వాదిస్తున్న ఎన్ ఐఏ.. ఇంటర్ పోల్ నోటీసు కూడా జారీచేసింది. కాగా ఈ తీర్పు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై చర్లపల్లి జైలు సహా హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇవి కూడా చదవండి: పురాణ కాలాల్లోనే అణుబాంబులు .. అందుకు ఆధారాలివివే

ఇవి కూడా చదవండి: జంట అరటిపళ్ళు తింటే కవలలు పుట్టడం నిజామా కాదా ?

English summary

NIA Court Sentenced Death For Accused People Of 2013 DilsukhNagar Bomb Blasts. NIA court seantenced death for Yasin Bhatkal, 4 others in this case.