టాప్ లెస్ సెల్ఫీతో ఉద్యోగం పోయింది.. కానీ ఇప్పుడు సూపర్ ఆఫర్ కొట్టేసింది

Nidia Gracia got a super chance in modeling agency

10:57 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Nidia Gracia got a super chance in modeling agency

వారం రోజుల క్రితం ఓ మహిళా పోలీసు అధికారి టాప్ లెస్ గా ఫోటో దిగి తన ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోవైపు అదే ఫోటోను చూసిన మోడలింగ్ ఏజెన్సీలు తమ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ఆఫర్లు మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి. వివరాల్లోకెళితే మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా గార్సియా అనే మహిళా పోలీస్ టాప్ లెస్ గా సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాం ను కిందికు దించి ఎంద అందాలను ఆరబోస్తూ పోలీసు వాహనంలో తన ఆయుధాలను కూడా పక్కన పెట్టుకుని సెల్ఫీ దిగింది. అంతేకాకుండా ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.

దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. అలా చేసినందుకు తనను తానే అసహ్యించుకుంటున్నానని నిదియా తెలిపింది. స్థానిక పోలీసు అధికారులకు కూడా క్షమాపణలు చెప్పంది. తాను ఫోటోలను దిగిన విషయాలను అంగీకరించిన నిదియా.. వాటిని తాను సోషల్ మీడియాలో ఎక్కడా అప్ లోడ్ చేయలేదని చెప్పింది. తన అభ్యరతకరమై టాప్ లెస్ ఫోటోలు దిగినందుకు అటు స్థానిక పట్టణ ప్రజలను కూడా మన్నించాలని కోరింది.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నిదియా టాప్ లెస్ సెల్పీ నేపథ్యంలో తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. తన ఇద్దరు కూతుళ్లు, భర్త, తల్లిదండ్రులు, సోదరులకు చెడ్డ పేరు తీసుకు వచ్చానని వాపోయింది. మరో వైపు తన సెల్పీల మోజుతో ఉద్యోగానికి ఎసరు తెచ్చకున్న నిదియా గార్సియాకు అదృష్టం మాత్రం ఆఫర్ల రూపంలో వరించాయి. పోలీస్ అధికారిని కాస్తా మోడలింగ్ రంగంలో ప్రవేశించాలని నిదియా వెంట పడుతున్నాయి. భారీ ఆపర్లను కూడా ప్రకటించేస్తున్నాయి. మరి నిదియా ఏం చేస్తుందో చూడాలి.

English summary

Nidia Gracia got a super chance in modeling agency. Mexican police officer Nidia Gracia got a chance in modeling for her topless selfie.