రాజకీయాలకు గుడ్ బై అంటున్న ఫరేజ్

Nigel Farage Says Good Bye To Politics

11:18 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Nigel Farage Says Good Bye To Politics

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవాలని కోరుతూ ఉద్యమం చేసిన ఇండిపెండెన్స్ పార్టీ నేత నీగెల్ ఫరేజ్ రాజీనామా చేస్తూ, ఇక తన బాధ్యత తీరిపోయిందన్నారు. 52 ఏళ్ళ ఫరేజ్.. 1993 నుంచి ఇండిపెండెన్స్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 1999లో మొదటిసారిగా యూరోపియన్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 'బ్రిటన్ లో గత నెలలో జరిగిన రెఫరెండం లో బ్రెగ్జిట్ కు అనుకూలంగా విజేతను కావాలన్న నా ఆశయం నెరవేరింది. నేనిక రాజకీయ నేతను కాను.. ఇక ఇండిపెండెన్స్ పార్టీ లీడర్ గా తప్పుకుంటున్నా..రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా' అని ఆయన పేర్కొన్నారు. 'నా దేశం నాకు తిరిగి కావాలి' అంటూ ప్రచారం చేశానని ఫరేజ్ చెబుతూ, ఇప్పుడు 'నా లైఫ్ నాకు తిరిగి కావాలంటున్నా' అని అన్నారు. అయితే బ్రసెల్స్ (ఈయూ క్యాపిటల్) నుంచి బ్రిటన్ పూర్తిగా విడిపోయేంతవరకు యూరోపియన్ ఎంపీగా కొనసాగుతానన్నారు.

ఇవి కూడా చదవండి:అమ్మాయిలూ ఇలాంటి దుస్తులతో రావద్దు

ఇవి కూడా చదవండి:రాత్రి 7 తరువాత ఈ తప్పులు చేయకూడదట

English summary

British Politician Nigel Farage who was asked the people to came out from EU was announced that he was going say good bye to politics.