ఫేస్ బుక్ పరిచయం కొంప ముంచింది

Nigerian Arrested For Doing Fraud in Online

12:24 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Nigerian Arrested For Doing Fraud in Online

అత్యాసో..అమాయకత్వమో..తెలియకో.. మోజో.. ఇలా ఎలా అనుకోవాలో ఏమో.. కొందరు ఆడాళ్లుమాత్రం వంచనకు గురవుతూనే ఉన్నారు. ఎందుకంటే, ఎక్కువ వడ్డీ వస్తుందని, ప్రయివేట్ వ్యక్తుల దగ్గర, చిట్ ఫండ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మోస పోవడం చూస్తున్నాం. అలాగే, ముక్కూమొఖం తెలీని నెంబర్ వన్ జాదూగాళ్లు విసిరిన వలకు చిక్కి, సోషల్ మీడియాలో చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఎన్నో సార్లు నైజీరియన్ మోసగాళ్లు చేసిన మోసాలు బయటపడ్డా, ఇంకా వాళ్ల ఉచ్చులోనే పడిపోయి, సొమ్ములు చేజార్చుకుని చివరికి లోబోదిబో మంటూ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయిస్తారు. ఇలాంటి ఘటన తాజాగా మరోటి వెలుగు చూసింది.

నైజిరియన్ అయిన ఆమ్లీజ్ ఫ్రెడ్ 2012 నుంచి ఢిల్లీలోని మొర్హాలిలో ఉంటున్నాడు. ఫేస్ బుక్ లో మారుపేర్లతో కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అమ్మాయిల వేట కొనసాగించాడు. ఇలా విసిరిన వలలో హైదరాబాద్ కు చెందిన బెన్సన్ అనే అమ్మాయి పడింది. తాను అమెరికాలో పెద్ద బిజినెస్ మ్యాన్ నని.. ఆఫీస్ పనిమీద ఆఫ్ఘనిస్థాన్ వచ్చానని, ఇండియాలో కూడా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించానని బెన్సన్ కు ఆమ్లీజ్ స్టోరీ చెప్పేశాడు.

ఈ క్రమంలో ఎయిర్ ఫోర్టు నుంచి జూలై 8న బెన్సన్ కు ఫోన్ వచ్చింది. బెన్సన్ మీకోసం డాలర్లు, బంగారం, డైమండ్స్ తీసుకొచ్చాడు.. ఇవి తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలని ఆ మొత్తం అతడి అకౌంట్ లో డిపాజిట్ చేయాలని ఫోన్ సారాంశం. దీంతో బెన్సన్ 2.50 లక్షలు అకౌంట్ లో జమ చేసింది.

బంగారం, డైమండ్స్, డాలర్లు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీకి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి మూడు ల్యాప్ టాప్ లు, 12 ఫోన్లు, 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మూడు ల్యాప్ టాప్ లలో దాదాపు 50వేల నెంబర్లు, లక్ష ఈ-మెయిల్స్ ఉన్నట్టు సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేశ్ భగవత వెల్లడించారు. అయినా, జ్ఞానోదయం కలగదు. ఇలాగే ఇంకా ఎక్కడెక్కడో మోసపోతూనే వున్నారు.

ఇవి కూడా చదవండి:సముద్రంలో ఈత కొడుతుంటే లావా పొంగింది.. ఆపై ఏమైంది?

ఇవి కూడా చదవండి:10 వేల గదులు, 70 రెస్టారెంట్లు, 4 హెలీప్యాడ్లు.. కానీ సిటీ కాదు!

English summary

A Nigerian who lives in Delhi was doing fraud in online by creating fake facebook id's and by saying that he was a big business man in America. Police arrested him in Delhi based on a complaint filed by the Hyderabad Girl.