అంతుచిక్కని వ్యాధితో మరణించిన ఇతనికి భార్యలు , పిల్లలు ఎందరో తెలుసా ?

Nigerian Man with '130 wives and 203 kids' dies

11:49 AM ON 1st February, 2017 By Mirchi Vilas

Nigerian Man with '130 wives and 203 kids' dies

సాధారణంగా చాలామందికి ఒక భార్యే ఉంటుంది. మహా అయితే ఇద్దరు ఇంకా కాదనుకుంటే, నలుగురైదుగురు వుంటారు కూడా. ఇక పురాణాల్లో స్ర్కీష్ణుడికి అష్ట భార్యలు అని చెబుతారు. కానీ నైజీరియా ఇస్లాం మత ప్రబోధకుడు మొహమ్మద్ బెలో అబూ బకర్ కి భార్యలు ఎందరో తెలిస్తే షాకవుతారు. ఈయన అంతుచిక్కని వ్యాధితో తుదిశ్వాస విడిచారు. 93 ఏళ్ల అబూ బకర్...నిగర్ రాష్ట్రంలోని బిదాలో ఉన్న తన నివాసంలో శనివారం ఆయన కన్నుమూశారు. ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో పెద్దఎత్తున జనం హాజరై అంతిమ నివాళులు అర్పించినట్టు ఆయన సహాయకుడు ముతైరు సలావుద్దీన్ బెల్లో నైజీరియా న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. స్వల్ప అస్వస్థతతోనే అబూబకర్ కన్నుమూసినట్టు చెప్పారు. ఖురాన్ పవిత్ర గ్రంథానికి అబూ బకర్ అసాధారణ భాష్యాలు చెప్పేవారు. ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకోచ్చని వాదించడం ద్వారా వివాదాస్పదుడుగా పేరు తెచ్చుకున్నారు. 2008లో ఆయన ఇతర ముస్లిం ప్రబోధకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇంతకీ ఈయనకు 130 మంది భార్యలు, 203 మంది పిల్లలు వున్నారు. ఆయన అప్పటికి పెళ్లి చేసుకున్న 86 మంది భార్యల్లో 82 మందికి వెంటనే విడాకులు ఇమ్మని వారు డిమాండ్ చేశారు. అయితే అబూ బకర్ మాత్రం పెళ్లిళ్లు చేసుకోవడమనే పవిత్ర కార్యానికి తాను కట్టుబడి ఉన్నానంటూ తెగేసి చెప్పారు. అబూబకర్ శనివారం కన్నూమూసే నాటికి ఆయన వివాహం చేసుకున్న 130 మందిలో కొందరు గర్భంతో ఉన్నారు కూడా. కాగా, బాబా (అబూబకర్) తాను చేయాల్సిన దైవకార్యం, ఈ లోకంలోకి వచ్చిన పని ముగిసిందని, ఆ అల్లానే కలుసుకునేందుకు వెళ్లిపోతున్నానని తనకు చెప్పినట్టు ముతైరు సలావుద్దీన్ బెల్లో తెలిపారు.

ఇది కూడా చూడండి: టైగర్ ని ఓ ఆట ఆడించిన బాతు(వీడియో)

ఇది కూడా చూడండి: ఇదో రకం జల్లికట్టు ... దేంతోనే తెలుసా ?

English summary

Nigerian man who was a muslim preacher died he had 130 wives and 203 children.