నిహారిక ఫ్యూచర్ పై నీలినీడలు

Niharika future was completed

11:55 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Niharika future was completed

ఇటీవల కొంతకాలం వరకూ కొణిదెల నిహారిక.. పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు వచ్చి వెండితెర మీద రాణిస్తున్నారు. వారిలో మూడో తరం హీరోలుగా కూడా కొందరు స్టార్ స్టేటస్ హోదా అనుభవిస్తున్నారు. అలాంటిది ఈ ఫ్యామిలీ నుంచి తొలిసారిగా నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండడంతో టాలీవుడ్ తో పాటు సినీ జనాల్లో కూడా ఆసక్తి ఉంది. నిహారిక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని అందరూ ఒక మనసు సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. ఒక మనసులో నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.

కానీ చాలా చోట్ల మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో విఫలమైందన్న విమర్శలు కూడా వచ్చాయి. దీంతో తొలి రోజు పెద్ద నస, బోరింగ్ మూవీ అన్న టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో నటిగా తాను ఎంతో ఎత్తుకు ఎదుగుతానని ఆశించిన నిహా ఆశలన్నీ అడియాశలయ్యాయి. దాంతో ఒక మనసు తర్వాత నిహారిక పూర్తిగా కనిపించడం మానేసింది. ఒక మనసు తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా రాలేదు. దీంతో ఇప్పుడు నిహారిక ఏం చేస్తుందా అని ఆరా తీస్తే ఒక మనసు రిజల్ట్ ఆమెను బాగా కుంగదీసినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె అస్సలు బయటకే రావడం లేదట.

అయితే తొలి సినిమాయే కావడంతో దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు నిహారిక ఇకపై సినిమాలు చేస్తుందా చేయదా అనే ప్రశ్న వినిపిస్తుంది. ఇక్కడ రాణించాలంటే గ్లామర్ టచ్ ఇవ్వాలి. మరి నిహారిక ఫ్యామిలీ అందుకు ఒప్పుకోదు. మరి ఈ పరిస్థితుల్లో సినిమాల్లో కొనసాగాలా? లేదా గుడ్ బై చెప్పాలా అన్న డోలయామానంలో నిహారిక ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవికి ముందు నుంచే నిహారిక హీరోయిన్ అవ్వడం ఇష్టంలేదనే టాక్ వినిపిస్తోంది. చిరు అయితే ఇప్పటికైనా ఆమెతో సినిమాలు మానిపించేయాలని చూస్తున్నాడట.

భవిష్యత్తు పై నీలి నీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితులలో ఇన్ని ప్రెజర్స్ మధ్య నిహారిక ఏం చేస్తుందోనని మెగా అభిమానులు, సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

English summary

Niharika future was completed