చిరంజీవికి షాకిచ్చిన నిహారిక

Niharika gave shock to Chiranjeevi

12:04 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Niharika gave shock to Chiranjeevi

మెగాబ్రదర్‌ నాగబాబు తనయ 'ఢీ' జూనియర్స్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించి బుల్లితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఇందులో మంచిగా యాంకరింగ్‌ చేస్తూ ప్రేక్షకులని అలరించిన నిహారిక ఆ తరువాత 'ముద్దపప్పు ఆవకాయ్‌' షార్ట్‌ ఫిలింలో లీడ్‌ రోల్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తాజాగా 'ఒక మనసు' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా నిహారిక నటిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఏప్రిల్‌లో విడుదలవుతున్న ఈ చిత్రం ఆడియో చాలా గ్రాండ్‌గా జరగనుంది. ఈ చిత్రాన్ని టీవీ9 తో కలిసి మధర శ్రీధర్‌ నిర్మిస్తున్నారు.

అయితే ఈ ఆడియో వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నారు. అయితే నిహారిక దానితోనే సరిపెట్టుకోకుండా ఆ ఆడియో వేడేకకి పవన్‌కళ్యాణ్‌ ని కూడా పిలవాలని చిరంజీవికి షాక్‌ ఇచ్చిందట. ఇంక చేసేది లేక పవన్‌ని తీసుకొస్తానని నిహారికాకి చిరు మాట ఇచ్చాడట.

English summary

Mega Daughter Konidela Niharika gave shock to Chiranjeevi. She is acting in a lead role in Oka Manasu movie. In this movie Naga Shourya is acting in a lead role.