మెగాడాటర్‌ను ముద్దడిగాడు...భలే బుద్ధి చెప్పింది

Niharika gave shocking reply that who asked her flying kiss

01:08 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Niharika gave shocking reply that who asked her flying kiss

మెగా డాటర్‌ నిహారిక ఈటీవిలో ప్రచారమయ్యే 'ఢీ జూనియర్స్‌' డాన్స్‌ షోలో యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమయింది. ఇందులో తన యాంకరింగ్‌తో కాస్త అభిమానుల్ని సంపాదించుకున్న నిహారిక ఆ తరువాత 'ముద్ద పప్పు ఆవకాయ్‌' షార్ట్‌ఫిలిం వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులకి మరింత దగ్గరయింది. ఈ ధైర్యంతోనే నాగశౌర్య హీరోగా నటిస్తున్న 'ఒక మనసు' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉంటే అభిమానుల కోరిక మేరకు నిహారిక నిన్న(గురువారం) సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు లైవ్‌ చాట్లో పాల్గొంది. నిహారిక లైవ్‌ చాట్లో రావడంతో ఎంతో మంది అబ్బాయిలు విపరీతంగా రెస్పాండ్‌ అయ్యి నిహారికకి పిచ్చిపిచ్చిగా ప్రశ్నలు వేశారు.

వారు అడిగే ప్రశ్నలన్నింటికీ ఏ మాత్రం తడబడకుండా దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది ఈ మెగా డాటర్‌. ఈ సందర్భంగా ఒక అభిమాని తనకి లైవ్‌లో ఫ్లయింగ్‌ కిస్‌ ఇమ్మని అడగగా అతనికి పంచ్‌ పడేలా సమాధానమిచ్చింది నిహారిక. అదేంటంటే ఫ్లయింగ్‌ కిస్‌ ఎందుకండీ..... నేను ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తే ఆ గాలికే మీరు ఎగిరిపోతారు, అందుకే నేను ఇవ్వనంటూ సమాధానమిచ్చింది. కొంత మందైతే నువ్వు చాలా అందంగా ఉన్నావు, మంచిగా నటిస్తున్నావని పొగిడారు. దీనికి నిహానిక మీరు ఇలా ఎంకరేజ్‌ చేస్తే నేనింకా రెచ్చిపోతా అని బదులిచ్చింది.

1/9 Pages

వీటితో పాటు నిహారిక ని మరికొన్ని విషయాలు అడిగారు అవేంటంటే..

English summary

Mega Brother Naga Babu's daughter Konidela Niharika gave shocking reply to her fan that he asked flying kiss in live chat.