నిహారిక చేతిలో ఓడిన పవర్ స్టార్

Niharika got highest views than Pawan Kalyan

09:38 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

Niharika got highest views than Pawan Kalyan

హిట్‌, ప్లాఫ్‌ల‌తో సంబంధం లేని క్రేజీ హీరో ఎవరంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ అని చెప్పేయచ్చు. అభిమానుల వెండితెర ఇల‌వేల్పు, వ్య‌క్తిగ‌త జీవితం, రాజ‌కీయ అస్థిర‌త ఎన్ని ఉన్నా ప‌వ‌న్‌కు అదే క్రేజ్‌. వ‌రుస ఫ్లాపులు వ‌చ్చినా అదే అభిమానం. అన్న చిరంజీవి కంటే ప‌వ‌న్‌కే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. అయితే ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్‌కు అన్న కూతురు నీహారిక నుంచి పోటీ ఎదుర‌వుతోంది. నాగ‌బాబు కుమార్తె కొణిదెల నీహారిక‌ను నెటిజ‌న్లు విప‌రీతంగా అభిమానిస్తున్నారు. నీహారిక అప్‌డేట్స్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఢీ యాంక‌ర్ గా తెలుగులోగిళ్ల‌కు ప‌రిచ‌య‌మైన నీహారిక 'ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ' వెబ్ సిరీస్ తో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

యంగ్ హీరో నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు తెరకెక్కిస్తున్న 'ఒక మ‌న‌సు' రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. అయితే నీహారిక మొద‌టి సినిమా రిలీజ్ కాక ముందే ఇంత క్రేజ్ రావ‌డం ఓ పెద్ద మిరాకిల్ అని ఫిల్మ్ క్రిటిక్స్‌ అంటున్నారు. ఇక బాబాయ్ ప‌వ‌న్‌, కుమార్తె నీహారికలు ఉగాదికి అటు ఇటుగా మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. అయితే టీవీ 9కు ఇద్ద‌రూ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు ఒకేసారి యూట్యూబ్‌లో అందుబాటులోకొచ్చాయి. అయితే బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట‌ర్య్యూకు కేవ‌లం 2 ల‌క్ష‌ల హిట్స్ వస్తే, అదే స‌మ‌యంలో నీహారిక ఇంట‌ర్వ్యూ 8 ల‌క్ష‌ల హిట్స్‌తో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

బాబాయ్ ప‌వ‌న్ కంటే చాలా చాలా అభిమానుల‌ను సంపాదించుకుంద‌న్న మాట‌. 'ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ' ఫస్ట్ సిరీస్‌కు పది లక్షల లైకులు పడితే, సెకెండ్ సిరీస్‌కు 8 లక్షల లైకులు సంపాదించి నీహారిక మూడో సిరీస్ కూడా దుమ్ము రేపింది. నీహారిక‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంద‌నడానికి ఇదే పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా ఫిల్మ్ క్రిటిక్స్‌ చెబుతున్నారు. నెటిజ‌న్లకు అభిమాన తార‌గా క్రేజ్ సంపాదించిన నీహారిక వెండితెర‌ పై కూడా మంచి మార్కులే కొట్టేయ‌నుంద‌ని అంచ‌నాలున్నాయి. మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన హీరోల‌ను మించిపోతూ మొద‌టి సినిమా విడుద‌ల కాక ముందే నీహారిక సంచ‌ల‌నాల‌కు తెర తీస్తోంది. అదండీ సంగతి.

English summary

Niharika got highest views than Pawan Kalyan. Niharika interview got 8 lakhs views in Youtube. But Pawan Kalyan got only 2 lakhs views in Youtube.