ఖైదీలో మెగా డాటర్?

Niharika in Chiranjeevi 150th movie

11:35 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Niharika in Chiranjeevi 150th movie

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా వస్తున్న ఖైదీ నెంబర్ 150కి సంబంధించి రోజుకో న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఐటెం సాంగ్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు వార్తలు రాగా, ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి పరిచయమైన మొదటి నాయికగా కొణిదెల నిహారిక గురించి వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ లో ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ప్రవేశించిన ఈ మెగా డాటర్ కు ఆశించిన బ్రేక్ రాలేదు. అందుకే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150లో నిహారిక కనిపించనుందట. ఆమెకోసం ప్రత్యేకంగా ఒక పాత్రను సృష్టించమని చిరు వినాయక్ ని కోరాడట.

దీంతో వినాయక్ ఇప్పటికే కసరత్తులు చేయడం ప్రారంభించినట్టు తెలుస్తుంది. పరుచూరి బ్రదర్స్ తమిళ వెర్షన్ కి బోలెడు మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. వాటి మధ్యలో ఒక పాత్ర సృష్టించడం పెద్ద కష్టమేమికాదు. అయితే ఈ పాత్ర హిట్ అయ్యి నిహారిక కెరీర్ కి బూస్ట్ అయితే చిరుకి అంతకన్నా ఆనందం వేరే వుంటుందా? అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఆడపిల్ల పుట్టిందని టవల్ లో చుట్టేసి.. వదిలి వెళ్లిపోయారు

ఇది కూడా చదవండి: రూ.5కోట్ల విలువైన కారు గిఫ్ట్ ఇస్తే .. ఆపై... (వీడియో )

ఇది కూడా చదవండి: మెగాకు కిక్కెక్కిస్తున్న తమన్నా ఐటెం ..

English summary

Niharika in Chiranjeevi 150th movie. Mega daughter Konidela NIharika in Chiranjeevi 150th movie.