ఆత్మగా నిహారిక!

Niharika Plays Ghost Role In Second Movie

10:45 AM ON 19th July, 2016 By Mirchi Vilas

Niharika Plays Ghost Role In Second Movie

ఫస్ట్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మెగా డాటర్ హీరోయిన్ నిహారిక సెకండ్ ప్రాజెక్ట్ లోకి వెళ్తోంది. తొలిసినిమా అయ్యాక రెండవ మూవీ గురించి రకరకాల ప్రశ్నలు వచ్చేసాయి. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ, లేటెస్ట్ గా ఆత్మ రోల్ లో ఈమె కనిపించనున్నట్లు ఓ వార్త షికారు చేస్తోంది. రెండేళ్ల కిందట మరాఠీలో హిట్టయిన ‘హ్యాపీ జర్నీ’ని తెలుగులో రీమేక్ చేయడానికి ఓ ప్రొడ్యూసర్ సన్నాహాలు చేస్తున్నాడట.

అన్నాచెల్లెళ్ల రిలేషన్ నేపథ్యం లో సాగే ఈ స్టోరీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. కధ విషయానికొస్తే, కొన్ని కారణాల వలన చనిపోయిన చెల్లెలు, ఆత్మగా అన్నయ్యతో వుంటూ అన్నికోణాల్లో సహకరిస్తూ ఉంటుందట. ఆత్మ క్యారెక్టర్ కి నటన పరంగా అవకాశం ఉండటంతో నటించడానికి నిహారిక గ్రీన్ సిగ్నల్ ఆ వార్త సారాంశం. బ్రదర్ పాత్రకి హర్షవర్ధన్ రాణే నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక కాగానే, ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి సినిమా టైటిల్ కూడా ఖరారు కాలేదు కానీ 'ఆత్మ' రోల్ కావడంతో ఇంచుమించు దానికి దగ్గరగా టైటిల్ ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: మార్నింగ్ వర్క్ అవుట్స్ చిట్కాలు

ఇది కూడా చూడండి: పడకగదిలో దేవుడు ఫోటోలు ఉండవచ్చా?

ఇది కూడా చూడండి: చద్దన్నం గురించి తెలిస్తే షాకవుతారు ?

English summary

Niharika Plays Ghost Role In Second Movie.