సర్దార్ సినిమా పై నిహారిక షాకింగ్ కామెంట్స్

Niharika Shocking Comments On Sardaar Movie

11:21 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Niharika Shocking Comments On Sardaar Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఇటీవల విడుదలై తోలి వారంలో భారీగా కలెక్షన్లు చేసింది. ఇక ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. సినీ హీరోలు , దర్శకులు , పవన్ కుటుంబ సభ్యులు ఇలా ఎవరికీ వారు తమ అభిప్రాయలు చెప్పేస్తున్నారు. ఇందులో కొందరి వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. తాజాగా నాగబాబు కూతురు నిహారిక బాబాయ్ పవన్ సినిమా చూసిందట. సర్దార్ కి వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై కొంచెం ఘాటుగానే స్పందించింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఈ సినిమా గురించి నిహారిక ఏమందంటే,' ఫ్రెండ్స్ తో కల్సి సర్దార్ చూసా. అందులోని వినోదం , పంచ్ డైలాగులు , సీన్స్ అదిరిపోయాయి , అందరం ఫిదా అయిపోయాం. సినిమా చాలా బావుంది' అని చెప్పింది. కావాలనే సర్దార్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని కూడా నిహారిక మండిపడిందట. అలాగే సినిమాను డ్యామేజ్ చేస్తూ రివ్యూ లు ఇచ్చిన వారిపై కూడా విరుచుకు పడిందని అంటున్నారు. సినిమా విమర్శకులకు నిహారిక ఇచ్చిన కౌంటర్ పై మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

ఇవి కూడా చూడండి:

బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

సర్దార్ పై బాబీ తండ్రి షాకింగ్ కామెంట్స్

ఆ గుళ్ళోకొస్తే రేప్‌లు జరుగుతాయా?!

English summary

Mega Brother Naga Babu Daughter Niharika says fires on Reviewers for giving Negative Rating to Sardaar Gabbar Singh Movie.