అక్కినేని ఫ్యామిలీ కధలో నిహారిక

Niharika To Act With Akkineni Family

09:40 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Niharika To Act With Akkineni Family

అక్కినేని కుటుంబం "మనం" లాంటి ఇంకో కుటుంబ కధా చిత్రం తెరక్కేకించాలని ఆలోచనలో ఉందట. అక్కినేని కుటుంబం చేసిన సినిమా మనం సూపర్‌హిట్‌ అయ్యింది . దీంతో అలాంటి సినిమా మరోసారి చేసే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తుంది. ఒక యువ రచయిత అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి మనం లాంటి కధను తయారుచేసి దిల్‌రాజు కు వినిపించాడని సమాచారం. దిల్‌రాజు ఈ కధను నాగార్జునకు వినిపించాడు. ఆ కధ నాగ్‌కు కూడా బాగా నచ్చడంతో 'సోగ్గాడే చిన్ని నాయనా' విడుదల తరువాత దాని గురించి ఆలోచిద్దామని చెప్పినట్లు సమాచారం. అయితే నాగార్జున,అఖిల్‌, నాగచైతన్య పాత్రలతో పాటు కీలకమైన ఒక హీరోయిన్‌ పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం దిల్‌రాజు మెగా డాటర్‌ నిహారికను సూచించాడని తెలుస్తోంది. ఈ సినిమా మొదలైతే అఖిల్‌ పక్కన నిహారిక హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమా అఖిల్‌ రెండవ సినిమాగా వస్తుందో లేక అఖిల్‌ రెండవ సినిమగా వేరే లవ్‌స్టోరీ తీసి తరువాత ఈ సినిమా చేస్తారో అన్న విషయం పై వివిద రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. నిహారిక మొదటి సినిమా 'ఒకమనసు' సినిమా ఘాటింగ్‌ దృశ్యాలు చూసిన వాళ్ళు, నిహారిక చాలా అవగాహన ఉన్న హీరోయిన్‌ లా నటిస్తుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నట్లుగా సమాచారం.

English summary

Mega Brother Naga Babu's daughter Niharika to act with Akkineni family film.