మెగా కూతురు కి ఎన్ టి ఆర్ అంటే పిచ్చి అట

Niharika want to act with Ntr

01:16 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Niharika want to act with Ntr

అవునా ఎన్టీఆర్ అంటే మెగా స్టార్ చిరంజీవి కూతురికి అంతా పిచ్చా.. ఎందుకంటే, వివరాల్లోకి వెళ్ళా ల్సిందే. మెగా స్టార్ చిరంజీవి కి తమ్ముడు కూతురు అయిన నిహారిక మెగాస్టార్ ని కూడా డాడీ అని పిలుస్తూ ఉంటుంది. ఇలా పిలవడం తనకు అలవాటు అని కూడా నిహారిక గతంలోనే చెప్పింది. ఆమె మాత్రమే కాదు తన అన్న వరుణ్ తేజ్ కూడా చిరంజీవిని చొరవగా డాడీ అని పిలుస్తాడు. ఇక నిహారిక ఇప్పుడు బుల్లితెర మీద సూపర్ హాట్ యాంకర్ అయ్యింది. త్వరలో ఆమె మొదటి సినిమా ఒక మనసు విడుదలకి సిద్దం అవుతోంది. అందులో నాగ శౌర్య హీరోగా నటిస్తూ ఉండగా, ఈ సినిమా మీద మెగా ఫాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమా విషయంలో చాలా సంగతులు చెబుతూ తనకి ఏ హీరో అంటే ఇష్టం అని ఎదురు అయిన ప్రశ్నకి తడబడకుండా నిహారిక ఎన్టీఆర్ పేరు చెప్పేసింది. ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నందమూరి హీరో పేరు చెప్పడం నిజంగా గొప్ప విశేషమే మరి. ఇక ఈ విషయం చెప్పగానే యాంకర్ సైతం షాక్ కి గురయింది. ఈ కాన్వర్సేషన్ అంతా ఆమె ఏ హీరోతో నటించాలి అనుకుంటోంది అని అన్నప్పుడు మొదలు అయ్యింది. తనకి తారక్ అంటే పిచ్చి అని, అతనితో నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నా అని నిహారిక చెప్పింది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఎవరు సినిమా తీస్తారో చూడాలి.

English summary

Niharika want to act with Ntr. Mega brother daughter Konidela Niharika want to act with Young Tiger Ntr.