నా రోల్ మోడల్ చెప్పిన వాడినే నేను పెళ్లి చేసుకుంటా..

Nihraika about her personal life

05:24 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Nihraika about her personal life

పెళ్ళయ్యాక సినిమాలు చేయనని.. అమ్మే తనకు రోల్ మోడల్ అంటూ మెగా డాటర్ నిహారిక వెల్లడించింది. ఇంకా తన పెళ్ళి విషయంలో నిర్ణయం, అధికారం పూర్తిగా అమ్మకేనని నిహారిక చెప్తోంది. తనకు స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులకు.. తన పెళ్లి చేసే అధికారం ఇచ్చేశానని.. చెప్తోంది. గృహిణిగా మా అమ్మే తనకు రోల్ మోడల్ అని.. తాను కూడా పెళ్లయ్యాక పిల్లల్ని పెంచడం.. కుటుంబాన్ని చూసుకుంటానని తెలిపింది. 'మదర్స్ డే' సందర్భంగా తల్లితో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోటోతో పాటు పెళ్లి గురించి నిహారిక నిజాలు చెప్పేసింది. అంతేకాకుండా తన తొలి సినిమా 'ఒక మనసు' గురించి నిహారిక మాట్లాడుతూ... ఇంట్లో అందరినీ ఒప్పించి హీరోయిన్‌గా మారిన విషయాన్ని వెల్లడించింది.

ఒక మనసు రిలీజ్ రిజల్ట్‌ పై టెన్షన్‌గా ఉన్న మాట నిజమేనని నిహారిక చెప్తుంది. నెగిటీవ్‌గా ఫీడ్ బ్యాక్ వచ్చినా.. వ్యక్తిగతంగా తానేమీ కుంగిపోనని ధైర్యంగా చెప్తుంది. ఇప్పటివరకు రెండో సినిమాలకు సంతకాలు చేయకపోవడానికి.. తొలి సినిమా ఫలితం కోసం వేచి చూడటమే కారణమని నిహారిక వెల్లడించింది.

English summary

Nihraika about her personal life. Mega brother Naga Babu daughter Konidela NIharika talks about her role model and personal life.