ఫిట్ నెస్ కోసం నైక్ ప్లస్ యాప్

Nike Plus Fitness App

04:27 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Nike Plus Fitness App

ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది అందరూ చెప్పేమాట. హైటెక్ యుగంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వారి సంఖ్యా అధికమే. మనలో అధిక శాతం మంది ఏదో ఒక విధంగా నిత్యం వ్యాయామం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా, జిమ్ వంటివి చేస్తున్నారు. వీటితోపాటు చక్కని శరీరాకృతి కావాలంటే నైక్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన నైక్ ప్లస్ ట్రెయినింగ్ క్లబ్ యాప్ ఉండాల్సిందే. మన శరీరంలో ఒక్కో భాగానికి అనుగుణంగా రూపొందించిన వర్కవుట్‌లు ఇందులో ఫొటోలు, వీడియోల రూపంలో లభ్యమవుతున్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుని చూడడం ద్వారా ఆయా వర్కవుట్లను సాధన చేస్తూ మరింత సమర్థవంతంగా వ్యాయామం చేయవచ్చు. అవసరమైతే ఇందులో ఉండే ట్రైనర్స్ ద్వారా సలహాలు, సూచనలు పొందవచ్చు. మీరు చేసే వర్కవుట్లను సోషల్ నెట్‌వర్క్ సైట్ల ద్వారా ఇతరులతో షేర్ చేసుకునే వీలు కల్పించారు. దాదాపు 100కు పైగా వివిధ రకాల వర్కవుట్లు ఇందులో లభ్యమవుతున్నాయి. బరువు తగ్గాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా గోల్ సెట్టింగ్ ఫీచర్‌ను ఇందులో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు ఇప్పుడు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary

Nike company launched a fitness app for mobile phones. With the use of this app we can know how to do work outs etc