తెలుగు డైరెక్టర్స్‌ని కింఛ పరిచిన పవన్‌ హీరోయిన్‌

NIkesha Patel shocking comments on Tollywood directors

04:15 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

NIkesha Patel shocking comments on Tollywood directors

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో 2010 సంవత్సరంలో నటించిన చిత్రం 'కొమరం పులి'. ఈ చిత్రంలో పవన్‌ సరసన నికిషా పటేల్‌ హీరోయిన్‌ గా తెలుగు తెరకు పరిచయమయింది. ఈ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో ఈ అమ్మడుకి తెలుగులో ఒక్క ఛాన్స్‌ కూడా రాలేదు. ఇంక చేసేది లేక ఈ అమ్మడు కన్నడ పరిశ్రమకి షిఫ్ట్‌ అయింది. అక్కడ సరైన విజయాలు సాధించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత ఈ అమ్మడు కళ్యాణ్‌రామ్‌ నటించిన 'ఓం 3డి' చిత్రంలో మరో అవకాశం వచ్చింది. ఈ చిత్రం కూడా అట్టర్‌ ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడుకి అసలు అవకాశాలు రాలేదు.

అయితే మళ్ళీ ఇప్పుడు తాజాగా సాయిరామ్‌ శంకర్‌ నటిస్తున్న 'అరకు రోడ్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా టాలీవుడ్‌ డైరెక్టర్స్‌ని కింఛపరస్తూ ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అదేంటంటే 'నటీనటులు ఎందుకు సక్సెస్‌ అవుతారంటే డైరెక్టర్లు చెప్పే దానిబట్టే మరియు వాళ్ళు సినిమాని తెరకెక్కించే దాని బట్టే. కానీ టాలీవుడ్‌ లో సరైన డైరెక్టర్‌ ఒక్కరు కూడా లేరని కుండ బద్దలు కొట్టేసింది'. అసలుకే ఈ అమ్మడుకి ఇక్కడ అవకాశాలు రాక దిగ్భ్రాంతిలో ఉంది. ఇంక ఇలాంటి కామెంట్స్‌ చేస్తే ఏ ఒక్కరూ అవకాశాలు ఇవ్వరని అనుకుంటున్నారు.

నికీషా పటేల్ నటిస్తున్న 'అరకు రోడ్లో' చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కింద స్లైడ్ షోలో చూడండి.

1/5 Pages

డైరెక్టర్:

అరకు రోడ్లో చిత్రాన్ని వాసుదేవ్ తెరకెక్కిస్తున్నారు. ఇది థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతుంది.

English summary

NIkesha Patel shocking comments on Tollywood directors. She told that the success of the actors who are just essaying the roles according to the Directors. But their are no perfect directors in Tollywood.