'అల్లు అర్జున్‌' సినిమా లు చూడలేదన్న పవన్‌ హీరోయిన్‌!

Nikesha Patel told i didn't watch Allu Arjun movies

03:12 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Nikesha Patel told i didn't watch Allu Arjun movies

హీరోయిన్‌ నికీషా పటేల్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన 'పులి' సినిమా ద్వారా 2010 లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత నికీషా పటేల్‌కి తెలుగులో మంచి అవకాశాలు ఏమీ రాలేదు. కన్నడలో ఈమెకి అవకాశాలు రావడంతో స్యాండల్‌వుడ్ లో బిజీ అయిపోయింది. రీసెంట్‌గా ట్విట్టర్ లో ఒక అభిమాని అల్లు అర్జున్‌ పై తన అభిప్రాయం అడిగితే తను ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ సినిమాలు ఏవీ చూడలేదని సమాధానం ఇచ్చింది నికిషా. ఇది చూసిన మెగా ఫ్యాన్స్‌ షాకయ్యారు! నిజాయితీగా ఉండటం మంచిదే, కానీ కొన్ని విషయాలలో సూటిగా మాట్లాడటం అంత మంచిది కాదు.

ఇప్పుడు వేరే హీరో ఫ్యాన్స్‌ అందరూ నికిషా కామెంట్‌ చేసిన స్క్రీన్‌ షాట్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అయితే ఈ హీరోయిన్‌ కన్నడలో బిజీగా ఉండటం వల్ల టాలీవుడ్‌ తో అంత అనుబంధం లేదు. అందుకే అల్లు అర్జున్‌ సినిమాలు చూసి ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్‌ అర్ధం చేసుకోవాలి.

English summary

Pawan Kalyan Puli movie heroine Nikesha Patel tweeted in twitter i didn't watch anyone of Allu Arjun movies.