నిఖిల్ కొంపముంచిన హీరోయిన్లు!!

NIkhil got upseted by heroines

01:54 PM ON 21st December, 2015 By Mirchi Vilas

NIkhil got upseted by heroines

యంగ్‌ హీరో నిఖిల్‌ తాజాగా నటించిన చిత్రం 'శంకరాభరణ'. ఈ చిత్రం అనుకున్న స్ధాయిలో ఆడకపోవడంతో నిఖిల్‌ తన తరువాత చిత్రం పై దృష్టి పెట్టాడు. 'టైగర్‌' ఫేమ్‌ విఐ ఆనంద్‌ దర్శకత్వంలో నిఖిల్‌ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ముగ్గురు కధానాయికలు కు ఆస్కారం ఉండడంతో తొలుత తాప్సీ, కేథరిన్‌ త్రెసా, అవికాగోర్‌ లను ఎంపిక చేసుకున్నారు. అయితే శంకరాభరణం ఫ్లాప్ అవ్వడంతో నిఖిల్‌ చిత్రానికి భారీగా ఖర్చు పెట్టలేని నిర్మాతలు తాప్సీ, కేథరిన్‌లకు ఎక్కువ పారితోషికం ఇవ్వలేక వెనుకడుగు వేశారు.

దీంతో తాప్సీ, కేథరిన్‌ ఈ చిత్రంలో నటించమని చెప్పేశారు. ఇంక చేసేది లేక హెబ్బాపటేల్‌, అవికా గోర్‌ లను ఎంపిక చేసుకున్నారు. మూడో కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది.

English summary

NIkhil got upseted by heroines Tapsee and Catherine Tresa.