నిఖిల్‌తో రొమాన్స్‌ చేస్తున్న 'కుమారి'!

Nikhil is romancing with Hebah Patel

03:27 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Nikhil is romancing with Hebah Patel

శంకరాభరణం తర్వాత నిఖిల్‌ నటిస్తున్న కొత్త చిత్రాన్ని 'టైగర్‌' ఫేమ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్‌ సరసన ఇప్పటికే అవికాగోర్‌ని ఎంపిక చేసుకోగా తాజాగా మరో హీరోయిన్‌ అవకాశం హెబ్బాపటేల్‌ని వరించింది. 'అలాఎలా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరికి పెద్దగా గుర్తింపురాలేదు. ఈ సినిమా బాగున్న ఇందులో హెబ్బా కొంచెం నలుపుగా చీర కట్టుతోనే కనిపిస్తుంది. అందువల్ల ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్‌ కాలేకపోయింది. ఈ చిత్రం చూసిన సుకుమార్‌ తనని పిలిచి మరీ కుమారి 21 ఎఫ్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు.

ఈ చిత్రంలో తన నటనతోనూ, ఎక్స్‌పోజింగ్‌తోనూ కుర్రాళ్ల మనసులో గిలిగింతలు పుట్టించింది. కుమారి సూపర్‌ హిట్‌ కావడంతో ఈ అమ్మడు లైఫ్ ఏ మార్చేసింది. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు మల్టీస్టారర్‌ చిత్రంలో రాజ్‌తరుణ్‌ సరసన హీరోయిన్‌గా ఎంపిక కాగా తాజాగా నిఖిల్‌ చిత్రంలో కూడా ఎంపికైంది. ఒకే ఒక్క చిత్రంతో ఓవర్నైట్ స్టార్‌ అయిపోయింది కుమారి.

English summary

Nikhil is romancing with Hebah Patel in new movie.