ముగ్గురు హీరోయిన్లతో నిఖిల్‌ రొమాన్స్‌!!

nikhil romancing with three heroines

03:55 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

nikhil romancing with three heroines

స్వామిరారా, కార్తికేయ, సూర్య vs సూర్య వంటి హిట్‌ చిత్రాలతో హ్యట్రిక్‌ హిట్స్ కొట్టిన కధానాయకుడు నిఖిల్‌. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం 'శంకరాబరణం'. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 4న విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిఖిల్‌ నెక్ట్స్‌ చిత్రం 'టైగర్‌' దర్శకుడు వీఐ ఆనంద్‌ తెరకెక్కించబోతున్నారు. స్వతహాగా స్టార్ హీరోల చిత్రంలో మినిమమ్ ఇద్దరు హీరోయిన్లు ఉండడం సహజం కుదిరితే ఒక్కోసారి ముగ్గురు, నలుగురు హీరోయిన్లుతో నటించడానికి వెనుకాడరు. అదే చిన్న హీరోలైతే బడ్జెట్‌ తక్కువ కాబట్టి మహా అయితే ఇద్దరు హీరోయిన్లుతో రొమాన్స్‌ చేస్తారు. కాని తాజాగా నిఖిల్‌-వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ఏకంగా ముగ్గురు హీరోయిన్లట.

ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు తాప్సీ, అవికాగోర్‌ లని ఎంపిక చేసేశారు. మూడో హీరోయిన్‌గా స్వాతిరెడ్డిని లేదా కొత్త హీరోయిన్‌ని ఎంపిక చెయ్యాలనుకుంటున్నారు. నిఖిల్‌-స్వాతి కలిసి స్వామిరారా, కార్తికేయ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఇప్పుడు బోర్‌ కొట్టేసి నిఖిల్‌కి అంటే పెద్దదిగా ఆంటీలా కనిపిస్తుండడంతో స్వాతినే ఎంచుకుంటారా లేక వేరే హీరోయిన్‌ని ఎంపిక చేస్తారా అనే సందేహం నెలకొంది.

English summary

nikhil romancing with three heroines