ఈ అందగత్తెకు నిద్రే శాపం.. ఎందుకో తెలుసా?

Nikhol is suffering from clean Levin Syndrome in London

12:14 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Nikhol is suffering from clean Levin Syndrome in London

అవును ఈమె చూడటానికి చాలా అందగత్తె.. కానీ ఈమెకు ఒక శాపం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. లండన్ కు చెందిన నికోల్(20) అనే బ్యూటీ నిద్రపట్టడం వల్ల ఇబ్బందులు పడుతోంది. అదేంటి నిద్ర పట్టడం వల్ల ఇబ్బందేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఆమె ఒక్కసారి పడుకుంటే కొన్ని రోజుల వరకు నిద్ర లేవదు. ఒకసారి అయితే ఏకంగా 64 రోజుల పాటు నిద్రపోతూనే గడిపింది. దీనికి కారణం ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుండడడమే. దాని పేరు 'క్లీన్-లెవిన్ సిండ్రోమ్'. ఆమె సాధారణంగా రోజులో 18 గంటలు నిద్రపోతూనే ఉంటుంది.

చిన్న వయసులో ఆ వ్యాధి గురించి తెలియక నికోల్ కావాలనే ఇంతలా నిద్రపోతోందని అనుకునేవారు తల్లిదండ్రులు. అయితే ఆమె 14వ జన్మదినం తర్వాత ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందని వాళ్లకు తెలిసింది. చూడడానికి చాలా అందంగా ఉండే నికోల్ స్లీపింగ్ టైమ్ ఒక్కోసారి 22 నుంచి 64 రోజుల వరకు ఉంటుంది. ఆ సమయంలో ఎంత లేపినా ఆమె నిద్రలేవదు. ఆకలేసినప్పుడు మాత్రం నిద్రకళ్లతోనే ఏదోకటి తినేసి పడుక్కుంటుంది. తల్లిదండ్రులు ఆమెను నిత్యం కనిపెట్టుకుంటూ ఉండి నీళ్లు బలవంతంగా తాగిస్తారు. ఒకసారి పడుకుని లేచాక ఎంత సేపు నిద్రలో ఉన్నానో నాకే తెలియదు.

ఎన్నో క్రిస్టమస్ లు, పుట్టినరోజులు, వేడుకలు నాకు నిద్రలోనే గడిచిపోయాయి. కుటుంబ సభ్యుల మరణవార్తలు కూడా నాకు తెలియవని నికోల్ తెలిపింది. ఎంతో అందంగా ఉండే తాను మోడల్ కావాలని అనుకునేదాన్నని నికోల్ తెలిపింది. ఇలాంటి అరుదైన వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది బాధపడుతున్నారట. దీనికి ఇప్పటి వరకు చికిత్స లేదు అని నిపుణులు చెప్తున్నారు.

English summary

Nikhol is suffering from clean Levin Syndrome in London