నికాన్ నుంచి కూల్‌పిక్స్ కెమెరాలు

Nikon Launched Coolpix A900, B700, B500 Compact Zoom Cameras

01:26 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Nikon  Launched Coolpix A900, B700, B500 Compact Zoom Cameras

ప్రముఖ అంతర్జాతీయ కెమెరా తయారీ సంస్థ నికాన్ మూడు కొత్త డిజిటల్ కెమెరాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎ900, బి700, బి500ల పేరిట ఈ మూడు కెమెరాలను రిలీజ్ చేసింది. ఎ900 ధర రూ.27 వేలు. బి700 ధర రూ.33,500. బి500 రూ.20 వేలు. ఈ కెమెరాలు త్వరలో వినియోగదారులకు లభ్యం కానున్నాయి. మూడు కెమెరాల్లోనూ బ్లూటూత్ లో ఎనర్జీ ఫీచర్‌ను అందిస్తోంది. దీంతోపాటు బిల్టిన్ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ వీటిలో ఉన్నాయి. కూల్‌పిక్స్ ఎ900 కెమెరాలో 35ఎక్స్ ఆప్టికల్ జూమ్, 20 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్, 4కె వీడియో రికార్డింగ్, 3 ఇంచ్ డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. కూల్‌పిక్స్ బి700 కెమెరాలో 20.3 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్, 60ఎక్స్ ఆప్టికల్ జూమ్, 3 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి సౌకర్యాలు ఉన్నాయి. కూల్‌పిక్స్ బి500 కెమెరాలో 16 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్, 40ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్, 3 ఇంచ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందిస్తోంది.

English summary

Worlds Popular Camera Company Nikon launched three new high definition cameras named Nikon Launched Coolpix A900, B700, B500 Compact Zoom Cameras.