బహమాస్ లీక్స్ బ్లాక్ మనీ జాబితాలో ప్రముఖ నిర్మాత(వీడియో)

Nimmagadda Prasad in Bahamas leaks

03:47 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Nimmagadda Prasad in Bahamas leaks

ఇప్పుడు మరో బ్లాక్ మనీ జాబితా కలకలం రేపుతోంది. ఈమధ్యే వచ్చిన పనామా లీక్స్ తరువాత బహమాస్ లీక్స్ నల్లకుబేరుల జాబితా మరింత రహస్యాన్ని బట్టబయలు చేసింది. 1990 నుంచి 2016 వరకు కంపెనీలు పెట్టిన వారి జాబితా గురువారం రాత్రి విడుదలైంది. బహమాస్ అట్లాంటిక్ మహా సముద్రంలోని చిన్న దేశం. ఇది ద్వీపాల సముదాయం. బహమాస్ లో నల్లధనం దాచుకున్న నల్లకుబేరుల జాబితాలో 475 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు నిగ్గుతేల్చారు. బహమాస్ లీక్స్ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పేర్లు కూడా ఉండటం విశేషం. ఈజాబితాలో నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్ కూడా ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన పలు కంపెనీలు సైతం జాబితాలో ఉన్నాయి.

పన్నురహిత దేశంగా పేరుపొందిన బహమాస్ లో భారతీయులు సూట్ కేసు కంపెనీలు పెట్టారు. మొత్తం నల్లకుబేరుల జాబితాలో మొత్తం 1.75 లక్షల మంది పేర్లు వెలుగు చూశాయి. ఈ విదేశీయులంతా నల్లధనాన్ని బహమాస్ కు తరలించారు. వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్, ఫ్యాషన్ టీవీ అమాన్ గుప్తా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సంజీవ్ కపూర్, జితేంద్ర పాత్రా, రఫిక్ ముల్తానీ పేర్లు బయటికి వచ్చాయి. బహమాస్ లీక్ లో పేర్లున్న వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాకుండా బహమాస్ లో బోగస్ కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసిన ప్రముఖులు పేర్లు బయటపడ్డాయి. ఇంకా ఎవరెవరి జాతకాలు బయట పడతాయో చూడాలి.

English summary

Nimmagadda Prasad in Bahamas leaks