9మంది  గ్రేటర్ ఉద్యోగుల సస్పెన్షన్

Nine GHMC Employees Suspension

09:52 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Nine GHMC Employees Suspension

ముజ్రా పార్టీలో అనైతిక చర్యలకు పాల్పడి పోలీసులకు పట్టుబడిన 9మంది జీహెచ్‌ఎంసీ అధికారులు సస్పెండ్‌ అయ్యారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేస్తూ, . ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు సంజయ్‌కుమార్‌, పద్మభూషణ్‌రాజు, రవీంద్రుడు, బిల్‌ కలెక్టర్లు కృష్ణ, నరహరి, జ్ఞానేశ్వర్‌, రణవీర్‌, భూపాల్‌, బాబూరావులు సస్పెండ్ అయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ నగర శివారు ఖానామెట్‌లో ఓ ప్రైవేటు భవనంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పోలీసులు దాడిచేసి 10 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో పాటు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకు న్నారు. సంచలన సృష్టించిన ఈ ఘటనపై కమిషనర్ సీరియస్ గా స్పందించారు.

English summary

Nine Greater Hyderabad Municipal Corporation(GHMC) employees were suspended due to their illegal actions in Mujra Party. GHMC officials were also has ordered an inquiry on this incident