నిర్భయ కేసులో నిందితుడి విడుదల..?

Nirbhaya Case Accused Member To Release

12:21 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Nirbhaya Case Accused Member To Release

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితుడైన మైనర్‌ బాలుడు ప్రస్తుతం అబ్జర్వేషన్‌ హోంలో ఉంటున్నాడు. 2012 వ సంవత్సరంలో ఓ పారా మెడికల్ విద్యార్ధిని పై దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తుల్లో ఒకరు బాల నేరస్తుడిగా ఉన్నాడు. ఆ మైనర్‌ బాలుడికి కోర్టు మూడు సంవత్సరాలు శిక్ష విధించింది. అయితే అతని శిక్షాకాలం ముగియడంతో ఢిల్లీ హైకోర్టు మైనర్‌ బాలుడిని విడుదల చెయ్యాలని భావిస్తుంది. అతనిని ఈ నెల 20న విడుదల చేసే అవకాశం ఉంది.

అయితే అతని విడుదలను ఆపాలని కోరుతూ మరికొంత కాలం అబ్జర్వేషన్‌ హోంలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును కోరింది.
దీనిపై కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ మాట్లాడుతూ ఇలాంటి నేరాల్లో దోషులుగా ఉన్నవారిని పోలీసు అబ్జర్వేషన్‌ లోనే ఉంచాలని అన్నారు.

నిర్భయ కేసులో అతికిరాతకంగా వ్యవహరించిన వ్యక్తిని విడుదల చేసిన తరువాత అతనికి పునరావాసానికి సంభందించిన విషయంలో స్పష్టత లేనందున అతనిని విడుదల చెయ్యకుండా పోలీసుల అబ్జర్వేషన్‌ లోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

English summary

A minor accused member who were in the case of nirbhaya is to be released on december 20. Central Government has requested delhi high court not release him