నిర్భయ రేపిస్ట్ మామూలోడు కాదట?

Nirbhaya Rapist checked for terror links

11:34 AM ON 29th June, 2016 By Mirchi Vilas

Nirbhaya Rapist checked for terror links

ఢిల్లీ లో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు ఇంకా జనం మరిచిపోలేదు. అసలు ఈ ఘటన తర్వాతే నిర్భయ చట్టం తెచ్చారు. అయినా అకృత్యాలు ఆగడం లేదు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులో రేపిస్టు మామూలోడు కాదని అంటున్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో జువెనైల్ నేరగాడని ముద్ర పడిన ఇతడికి ప్రమాదకరమైన జిహాదీ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇప్పుడు 21 ఏళ్ళ వాడైన ఈ నేరగాడి కదలికలపై నిఘా పెట్టాల్సిందిగా ఉత్తర ప్రదేశ్ లోని అధికారులకు కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థలు సూచించాయి. యూపీ లోని బాదౌమ్ జిల్లాకు చెందిన ఇతడి పేరు ఇప్పటివరకు బయటపడలేదు.

ఢిల్లీలో బస్సులో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన నాటికి వీడికి 18 ఏళ్ళు. మైనర్ అన్న కారణంగా ఇతడిని జువెనైల్ హోం కి తరలించారు. ఆరు నెలల క్రితం ఇతడిని విడుదల చేశారు.2011 లో ఢిల్లీ హై కోర్టు వద్ద జరిగిన బాంబు పేలుడులో నిందితుడైన కాశ్మీరీ జిహాదీతో ఇతనికి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఏడాది కాలంగా వీళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. వేర్పాటువాద కాశ్మీరీలకు మద్దతు ఇవ్వాలని ఆ కుర్ర జిహాదీ ఈ రేపిస్టు ను ప్రోత్సహిస్తూ వచ్చాడని తెలిసింది. దీంతో ఇతడు వేర్పాటువాద కార్యకలాపాల పట్ల ఆకర్షితుడయ్యాడని భావిస్తున్నారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు, రేపిస్టు ముదిరి ఉగ్రవాది అయ్యాడా ?

ఇవి కూడా చదవండి:టర్కీలో ఉగ్ర దాడి - 50 మంది మృతి

ఇవి కూడా చదవండి:హైదరాబాద్ లో ఐసిస్ జాడలు - నల్గురు అరెస్టు

English summary

Nirbhaya Rapist who was a minor released was having links with Terrorist group and Central Intelligence Beauro kept an eye on him and they were obeserving his moves.