న్యాయం ఓడిపోయింది

Nirbhayas Parents On Release Of Accused Guy

12:58 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Nirbhayas Parents On Release Of Accused Guy

2012 వ సంవత్సరంలో ఓ పారా మెడికల్‌ విద్యార్థిని పై దాడి చేసి సాముహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితుల్లో ఒకరైన బాల నేరస్తుడికి మూడు సంవత్సరాల జైలు శిక్షను అప్పట్లో ఢిల్లీ హైకోర్టు విధించింది. అయితే ఇప్పడు అతని శిక్షా కాలం ముగియడంతో అతని విడుదలను ఆపాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును కోరింది. అయితే పలు వాదనలు విన్న కోర్టు ఆ బాల నేరస్తుడి విడుదల పై స్టే విధించేందుకు నిరాకరించింది. అతనివిడుదల ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది.

నిర్భయ కేసులో ఆ బాల నేరస్తుడిని విడుదలను ఆపలేమని ఢిల్లీ హైకోర్టు చెప్పడంతో బాధితురాలి తల్లి ఆశాసింగ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఆమె మాట్లాడుతూ తమకు న్యాయం జరగలేదని, నేరం గెలిచిందిని, తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసారు.

English summary

Asha Singh, the mother of the girl who raped and tortured a young medical student in 2012 in delhi. The accused minor boy was going to release on december 20. Asha Singh opposes that release of that accused guy and She says that " The assurance that we were given that we will get justice has not happened. A criminal has been let off"