సెట్ లోనే అసిస్టెంట్ ఇచ్చిన పేపర్లను గాల్లోకి విసిరేసిన నాగార్జున(వీడియో)

Nirmala Convent movie new teaser

04:32 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Nirmala Convent movie new teaser

అసిస్టెంట్ తెచ్చి ఇచ్చిన ఆ పేపర్స్ ఏంటో చూడకుండానే విసిరేసిన నాగార్జునని చూసి చిత్రయూనిట్ షాక్ కి గురయ్యారు. ఇదేదో నిజంగా అనుకునేరు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తూ.. కీలకపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'నిర్మలా కాన్వెంట్'. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జి. నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పలు ట్రైలర్స్ విడుదల కాగా లేటెస్ట్ గా మరో టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో హెడ్ సెట్ పెట్టుకొని షూటింగ్ సెట్ లో కూర్చొని ఉన్న నాగార్జునకు ఓ అసిస్టెంట్ స్క్రిప్ట్ తెచ్చి ఇస్తాడు.

అది ఏంటో చూడకుండానే వాటిని గాల్లోకి విసిరేస్తాడు నాగ్. ఆ తర్వాత ఏంజరిగిదంటూ కింద ఓ సబ్ టైటిల్ తో టీజర్ ని రిలీజ్ చేసారు. జై చిరంజీవ, రోబో చిత్రాల ఫేమ్ శ్రియ శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రోషన్ సాలూరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఒకసారి ఆ టీజర్ పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Nirmala Convent movie new teaser