స్వర'రాజా' కు పురస్కారం 

Nishagandhi Awarded To Ilayaraja

11:38 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Nishagandhi Awarded To Ilayaraja

మెలోడీ బాణీలకు పెట్టింది పేరు, అప్పుడు , ఇప్పుడూ కూడా యువతను గిలిగింతలు పెట్టే, ఉర్రూతలూగించే, స్వరాల మాంత్రికుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం నిశాగాంధీ పురస్కారం అందజేసింది. కేరళ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో నిశాగాంధీ డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ ఈ అవార్డును ఇళయ రాజాకు అందించారు. ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ. 1,50,000 నగదు పారితోషికం ఇచ్చారు. అంతేకాదు, మ్యూజిక్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఇళయరాజాకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ఉమెన్‌చాందీ ప్రకటించారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన ఇళయరాజా అకాడమీ ఏర్పాటు చేయడం ద్వారా వందలాది మంది ఇళయరాజాలను తయారుచేస్తానని ప్రకటించి, స్వరాభిమానుల నుంచి కరతాళ ద్వను లండుకున్నారు.

English summary

Kerala Government facilitated Music Director Cum Singer Ilayaraja with Nishagandhi award.Kerala Cheifminister gives award to Ilayaraja