డ్రైవర్ లెస్ కారును టెస్ట్ చేసిన నిస్సాన్

Nissan Tests Driver Less Car

04:42 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Nissan Tests Driver Less Car

డ్రైవర్ లెస్ కారు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న అంశం. తాజగా జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ డ్రైవర్ రహిత కారును అమెరికాలోని అంతరిక్ష సంస్థ నాసాలో విజయవంతంగా పరీక్షించింది. రోబోటిక్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఈ కారును అభివృద్ధి చేశారు. సాధారణంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇతర గ్రహాలపై స్వయంగా నడిచే రోవర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ రకం డ్రైవర్ లెస్ కార్లు అందరికీ ఉపయోగపడేలా రూపొందించేందుకు నాసాకు చెందిన ఏమ్స్ పరిశోధన కేంద్రం, నిస్సాన్ ఉత్తర అమెరికా సంస్థలు ఏడాదిగా శ్రమించాయి. ఈ రెండు సంస్థలు కలసి పనిచేయడం వల్ల ఈ రకం కార్లు తయారు చేయడం శాస్త్రవేత్తలకు సులువైంది. లీఫ్ (ఎల్‌ఈఏఎఫ్) అనే ఈ వాహనం సురక్షితంగా, విజయవంతంగా నడుస్తున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ వాహనానికి కెమెరాలు, సెన్సార్లు, డేటా నెట్‌వర్కింగ్ వ్యవస్థ, గతంలో తయారు చేసిన ఏమ్స్ కె-10, కె-రెక్స్ రోవర్లలో వాడిన రోబోటిక్ సాంకేతికతను జోడించారు. డ్రైవర్ రహిత కార్ల తయారీలో వాడుకున్న ఈ స్పేస్ టెక్నాలజీని భవిష్యత్‌లో విమాన రంగంలో కూడా వినియోగించేందుకు ఏమ్స్ సంస్థ కృషి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary

Nissan has successfully test-driven its all-electric, driverless car at Nasa's Ames Research Centre in California this week that will help scientists send self-driving vehicles on deeper space missions.