నీతా అంబానీ అరుదైన రికార్డు

Nita Amban Elected To International Olympic Committee

11:02 AM ON 5th August, 2016 By Mirchi Vilas

Nita Amban Elected To International Olympic Committee

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో తొలి భారతీయ మహిళా సభ్యురాలిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. ఐఓసీ 129వ సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్ పర్సన్ అయిన నీతా అంబానీ ఇటీవలే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కూడా ప్రారంభించారు. దీంతో ఈమె ఈ పోస్ట్ కు గత జూన్ లో నామినేట్ అయ్యారు. 70 ఏళ్ల వయసు వచ్చేవరకూ నీతా అంబానీ ఈ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతారు. ఓలింపిక్ అజెండా 2020 ఆధారంగా కొత్త సభ్యుల ఎంపిక జరిగింది. నీతా అంబానీ అనేక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపడ్తున్నారు. విద్య, క్రీడలు, ఆరోగ్యం, కళలు, సంస్కృతి రంగాల్లో నీతా అంబానీ అనేక కార్యక్రమాలు చేపడ్తున్నారు. తనను ఐఓసీ సభ్యురాలిగా ఎంపిక చేయడంపై నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ మహిళలకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయంగా క్రీడాకారులకు మద్దతుగా ఉంటానని నీతా అంబానీ చెప్పారు. గతంలో దొరాబ్జీ టాటా ఐఓసీ సభ్యుడిగా ఉన్నారు. రాజా రణ్ ధీర్ సింగ్ 2000-2014 ఇంటర్నేషనల్ బాడీలో గౌరవ సభ్యుడిగా కొనసాగారు. మొత్తానికి నీతా అంబానీ అరుదైన రికార్డు సాధించారు.

ఇది కూడా చూడండి: ఇకపై స్మార్ట్ ఫోన్ తో వీర్యకణాలు చెక్ చేసుకోవచ్చు!

ఇది కూడా చూడండి: ఇంతకీ పవర్ స్టార్ స్టాటజీ ఏంటి?

ఇది కూడా చూడండి: జైలు గదినే ఫైవ్ స్టార్ హోటల్ చేసేసాడు!

English summary

Nita Ambani is the First Indian Woman Elected To International Olympic Committee.