నీతా అంబానీ కాస్ట్లీ లైఫ్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

Nita Ambani costly life

03:19 PM ON 7th July, 2016 By Mirchi Vilas

Nita Ambani costly life

సమాజంలో కొంతమంది లేడీస్ అతి ఖరీదైన జీవనం సాగిస్తుంటే, చాలామంది సాదా జీవితం గడుపుతున్నారు. ఇక నీతా అంబానీ గురించి ప్రస్తావిస్తే, షాకవుతాం. భారతదేశంలోని అత్యంత కాస్ట్లీ లేడీస్ లో ఒకరైన ఆమె లైఫ్ స్టైల్ చూస్తే అంబానీ ఫ్యామిలీస్ స్థాయి ఏంటనేది చెప్పకనే చెపుతోంది. నీతా అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ భార్యగా ఆమె భర్తకు అన్ని రంగాల్లోను చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆమె ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఓనర్. నిత్యం వ్యాపార వ్యవహారాలు, మీటింగ్ లు ఇలా తలమునకలై ఉంటారు. ఆమె రోజు మొత్తం లైఫ్ స్టైల్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంటుందని తెలుస్తోంది.

ఆమె లైఫ్ స్టైల్ ఎంత కాస్ట్లీ అంటే ఆమె ప్రతి రోజు ఉదయం తాగే కాఫీ కప్పు ఖరీదు ఏకంగా 3 లక్షల రూపాయలు విలువ చేస్తుందట. కాఫీ కప్పే అంత రేటు ఉంటే మిగిలిన వాటి గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే, అదొక్కటే కాదు ఆమె వాడే ప్రతి వస్తువూ ఖరీదైనదే. నీతా అంబానీ ఇంట్లో డైనింగ్ టేబుల్ కి కోటిన్నర ఖర్చు చేశారట. ఎందుకంటే, బంగారు ప్లాటినం డైమండ్ టేబుల్ వేర్ ఏర్పాటు చేశారట. ఆమె వాడే వాచీలు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచీలే. ప్రపంచంలోనే టాప్ వాచీ బ్రాండ్లు అయిన బల్గరీ రాడో గుక్కి కాల్విన్ క్లెయిన్ ఫాజిల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల వాచీలు వాడుతారు.

ఇక ఆమె హ్యాండ్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్నెల్ గోయార్డ్ జిమ్మీ చూ వంటి బ్రాండ్లవే వాడుతారు. వాటిలో ప్రారంభ ధరే 40 లక్షల రూపాయలు ఉంటుందట. ఇక ఆమె వాడే చెప్పుల విషయానికి వస్తే ఆమె ఒకసారి వాడిన చెప్పులు మరోసారి వాడరట. అలా అని అవేమీ వందలు వేల ధరల్లో ఉండేవి కావు.. అన్నీ లక్షల ఖరీదు చేసేవే. ఆమె వాడే ఏ బ్రాండయినా కూడా మినిమం లక్ష రూపాయలు ఉంటుందట. నీతా ఖరీదైన లైఫ్ స్టైల్ చూస్తే కళ్లు జిగేల్ మనడమే కాదు, కొందరికి కన్ను కుడుతుంది కూడా.

నీతా అంబానీ వాడే విలువైన వస్తువులు కింద స్లైడ్ షోలో చూడవచ్చు...

1/16 Pages

English summary

Nita Ambani costly life