శాతకర్ణి కోసం ఈమె శ్రమ కీలకం ...

Nitalulla costume designer for Gautamiputra Satakarni

11:27 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Nitalulla costume designer for Gautamiputra Satakarni

నందమూరి నటసింహం బాలయ్య ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురించి ఇప్పుడు మరో కొత్త న్యూస్ వచ్చింది. అసలు ఫస్ట్ లుక్ లో బాలయ్య గెటప్, డ్రెస్ చూసి, దీనికి డిజైనర్ ఎవరనేది అన్న ప్రశ్నకు చాన్నాళ్లుగా సమాధానం దొరకలేదు. లేటెస్ట్ గా అందుకు సంబంధించిన సమాచారం బయటకువచ్చేసింది. ప్రజెంట్ జార్జియాలో శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ ఫిల్మ్ కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా నీతాలుల్లా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. హిస్టరీ నేపథ్యమున్న సినిమాలంటే కాస్ట్యూమ్స్ కీలకం. అందుకే శాతవాహనుల కాలానికి చెందిన ట్రెడిషన్ ను ఈమె క్షుణ్ణంగా స్టడీ చేసింది.

మూవీ ప్రారంభానికి ముందే నీతాని సంప్రదించి, క్రిష్ ఓకే చేశాడు. ఈమె దాదాపు 300 సినిమాలకు డిజైనర్ గా వ్యవహరించింది. గతంలో దేవదాసు, జోధాఅక్బర్ వంటి సినిమాలకు పనిచేసిన అనుభవం ఈమె సొంతం. అంతేకాదు మూడు జాతీయ అవార్డులను దక్కించుకుంది. అందుకే శాతకర్ణి కోసం చాలావరకు రీసెర్చ్ చేసిన తర్వాత కాస్ట్యూమ్స్ కోసం డైరెక్టర్ క్రిష్ , కెమెరామన్ , ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి ప్రతీ సీన్స్ కు తగ్గట్టుగా డిజైన్ లో నిమగ్నమైంది. సైనికులు ధరించే దుస్తుల విషయంలో కూడా ఆమె చాలా కేర్ తీసుకుంటోంది.

ఇది కూడా చూడండి: కబాలిని ఆపాలని టాలీవుడ్ లో స్కెచ్...

ఇది కూడా చూడండి: డైరెక్టర్ తో నదియా రొమాన్స్!

ఇది కూడా చూడండి: మెగాస్టార్ 150వ మూవీ జిరాక్స్ కాపీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్నికృష్ణ

English summary

Nitalulla costume designer for Gautamiputra Satakarni.