నితిన్‌కి ఇద్దరు హీరోయిన్స్‌ కావాలట!

Nithin again romancing with two heroines in his new movie

04:05 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Nithin again romancing with two heroines in his new movie

నితిన్‌ ఇటీవల నటించిన చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అట్టర్‌ ఫ్లాప్గా నిలిచింది. నితిన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'అ...ఆ..' ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌ సరసన మొదటి సారి సమంత నటిస్తోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ మరో కధానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఘాటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. నితిన్‌ ఈ సినిమాలోనే కాకుండా తన తదుపరి చిత్రంలో కూడా ఇద్దరి హీరోయిన్స్‌తో సరసాలు ఆడబోతున్నాడు. అ...ఆ.. తరువాత నితిన్‌ వేణు మల్లిడి దర్శకత్వంలో నటించబోతున్నారు.

అందులో రకుల్ ప్రీత్ సింగ్ ని ఒక హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోకి మరో హీరోయిన్‌ ప్రణీత కూడా వచ్చి చేరింది. ఈ చిత్రాన్ని నితిన్‌ సొంత బ్యానర్‌ అయిన శ్రేష్ఠ మూవీస్‌ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విషయాలు తెలియాల్సి ఉంది.

English summary

Nithin again romancing with two heroines in his new movie. The two heroines was rakul preeth singh and pranitha subhash.