పవన్ గుర్రం  నితిన్ కి ఎలా వచ్చింది  ....

Nithin And Samantha Playing With Sardaar Gabbar Singh Horse

10:26 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Nithin And Samantha Playing With Sardaar Gabbar Singh Horse

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం కోసం ఇటీవల విడుదలైన టీజర్‌లో పవన్‌కల్యాణ్‌ చెక్కతో చేసిన గుర్రపు బొమ్మపై సరదాగా ఆడుకుంటూ కనిపించడం. ఈ గుర్రం బొమ్మను ప్రత్యేకంగా ఎలా రప్పించారో నటుడు ఆలీ వివరించడం తెలిసిందే. మరి ఇదే ఫోజులో నటుడు నితిన్‌ దర్శన మిస్తున్నాడు. మరి నితిన్ ని గుర్రపు బొమ్మపై స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆడిస్తోంది. ఇంతకీ ఈ గుర్రం నితిన్ కి ఎలా వచ్చింది? అది తెలుసుకుందాం ...

నితిన్‌, సమంత జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న‘అ..ఆ’ చిత్రం షూటింగ్‌లో సమంతతో కలిసి సరదాగా గడిపిన ఓ వీడియోను నితిన్‌ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అందులో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ టీజర్‌లో పవన్‌కల్యాణ్‌లాగా నితిన్‌ గుర్రంపై ఆడుకుంటున్నాడు. సమంత నితిన్‌ని గుర్రంపై ఆడిస్తోంది. ఇక స్వతహాగా పవన్‌కు వీరాభిమాని అయిన నితిన్ ‘అఆ’ సెట్స్‌లో సమంత సహకారంతో చెక్క గుర్రంపై స్వారీ చేసిన వీడియో నెటిజన్లకు చూపించాడు. ఇంకేముంది.. అభిమానుల హంగామా షురూ. పైగా దీనికి దర్శకుడు మాటల మాంత్రికుడే అంటూ పవన్‌కి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్‌ని ఇన్వాల్వ్ చేశాడు ఈ యవహీరో. ఇదిలా ఉంటే.. తన ప్రతి సినిమాలోను పవన్‌ పాటలను, సన్నివేశాలను వాడే నితిన్ ‘అఆ’ కోసమే ‘సర్దార్’ గుర్రమెక్కాడా అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వాటిలో నిజమెంత అన్నది మే 6న తేలనుంది. మొత్తానికి ఈ వీడియో హల్ చల్ చేస్తూ అలరిస్తోంది.

ఇవి కూడా చదవండి

మిస్ ఇండియా కాంపిటేషన్ లో చిత్తూరు నెరజాణ ...

మోడలింగ్ ఫొటోలతో 'వ్యభిచారి' గా బుక్కయిన టీచర్

'సర్దార్ ' లో దాగున్న రహస్యాలు

పాపం.. 19 నెలల కూతురినే పెళ్ళాడిన తండ్రి ...

మ్యాచ్ జరుగుతుండగానే బిడ్డను కన్న ప్లేయర్

Look what just happened on our sets of A Aa.. choreographed by Samantha Ruth Prabhu and directed by Trivikram garu.. ? ? ?

Posted by Nithiin on Saturday, March 26, 2016

English summary

We all know very well that Young Hero Nithiin was a big fan of Power Star Pawan Kalyan. In past many times Nithiin showed his attention towards Pawan Kalyan. Now Nithin and Samantha were recalls the moment of Pawan Kalyan Playing with Horse. Now this was going viral over the internet.