అఖిల్ కి జర్క్ ఇచ్చిన నితిన్

Nithin gave shock to Akhil

12:21 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Nithin gave shock to Akhil

తన బెస్ట్ ఫ్రెండ్ అఖిల్ ని అఖిల్ మూవీతో నితిన్ టాలీవుడ్ లో గ్రాండ్ గా లాంచ్ చేశాడు. అయితే ఎంతో హైప్ తో రిలీజ్ అయిన ఆ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో నితిన్ కి భారీ లాస్ వచ్చింది. కానీ నితిన్ ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీతో వున్న ఫ్రెండ్ షిప్ వల్ల నితిన్ ఈ మూవీ ఫెయిల్యూర్ గురించి అసలు నోరు మెదపలేదు. ఇక హను రాఘవపూడితో తన సెకండ్ మూవీ చేయబోతున్నానని అఖిల్ ఆ మధ్య ట్వీట్ పెట్టి అభిమానుల్లో ఆనందం నింపాడు. కానీ.. క్రిష్ణగాడి వీర ప్రేమగాధ తరువాతి సినిమా కూడా హను రాఘవపూడి 14 రీల్స్ కే చేయాలని కాంట్రాక్ట్ ఉంది.

కానీ.. అఖిల్ 14 రీల్స్ లో చేయడానికి నిరాకరించాడని, దాంతో అతనికి బదులుగా నితిన్ తో హను ఈ సినిమా చేయబోతున్నాడని టాక్ మొదలైంది. అఖిల్ కు చెప్పిన కథతోనే నితిన్ తో హను 14 రీల్స్ లో సినిమా చేయబోతున్నాడట. దాంతో అఖిల్ కి నితిన్ ఝలక్ ఇచ్చాడంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని అభిమానులు కొట్టి పారేస్తున్నారు.

English summary

Nithin gave shock to Akhil