'అ ఆ' జోష్ తో సొంత సినిమాకు రెడీ

Nithin ready to do movie in his home banner

01:09 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Nithin ready to do movie in his home banner

'అ..ఆ..' మూవీ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న నితిన్ ఆ మూవీ సక్సెస్ ని బానే ఎంజాయ్ చేస్తున్నాడు. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావడంతో హీరోగా నితిన్ రేంజ్ కూడా రెట్టింపయ్యింది. ఈ క్రమంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో అంటున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒకటి.. నితిన్ తన హోమ్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే నితిన్ కి స్టోరీ చెప్పడం, ఓకే చేయడం అంతా జరిగిపోయిందని టాక్.

ప్రస్తుతం సురేందర్.. చెర్రీ ధ్రువ తో బిజీగా వున్నాడు. అది ఫినిష్ కాగానే సెప్టెంబర్ లో నితిన్- సురేందర్ రెడ్డి కాంబో మూవీ ప్రారంభం కావచ్చని ఇన్ సైడ్ సమాచారం. మరోవైపు బెంగాల్ టైగర్ ఫిల్మ్ని నిర్మించిన రాధామోహన్ బ్యానర్ లో మరో ఫిల్మ్ చేయడానికి నితిన్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ముందుగా సొంత బ్యానర్ పై ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు.

English summary

Nithin ready to do movie in his home banner