నితిన్ చూపు ... తిరుమల వైపు

Nithin To Act Under Kishore Tirumala Direction

01:34 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Nithin To Act Under Kishore Tirumala Direction

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ చాలా కాలం తర్వాత మచి హిట్ అందించిన ‘నేను శైలజ’ సినిమా యంగ్ హీరో నితిన్ ని ఆకట్టుకుంది. ఈ సినిమా రామ్ కెరీర్ కి బూస్టప్ ని ఇచ్చింది. అయితే నితిన్ కి నచ్చింది మాత్రం డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్షన్. వాస్తవానికి నేను శైలజ సినిమాతో రామ్ కి ఎంత పేరు వచ్చిందో, తిరుమలకు కూడా తొలి హిట్ ని ఇచ్చి తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. అందుకే నితిన్ చూపు తిరుమల వైపు మళ్ళింది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కి పలు ఆఫర్స్ వచ్చినా, ఫైనల్ గా నితిన్ తో ఓ సినిమా చేయడానికి తిరుమల సిద్దం అయ్యాడు. రీసెంట్ గా కిషోర్ తిరుమల చెప్పిన స్టొరీ లైన్, బ్రీఫ్ స్టొరీ నితిన్ కి తెగ నచ్చేసిందట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘అ..ఆ’ సినిమా చేస్తున్న నితిన్ అప్పుడే తదుపరి మూవీ పై దృష్టి పెట్టేసాడు. వచ్చే ఏప్రిల్ 22న ‘అ..ఆ’ సినిమా రిలీజ్ కానున్న నేపధ్యంలో తరవాత కిషోర్ తిరుమల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే విషయాన్ని నితిన్ తెలియజేస్తూ,‘నా తదుపరి సినిమా విషయాన్ని హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నా. నా నెక్స్ట్ మూవీ నేను శైలజ ఫేం కిషోర్ తిరుమలతో ఉంటుంది. అది కూడా మా హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో. పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాం’ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు.

English summary

Tollywood Young Hero Nithin to act under the direction of Nenu Sailaja Movie Fame Kishore Tirumala.Presently Nithin was acting under the direction of Trivikram Srinivas and Samantha was acting as heroine in that movie