జనతా గ్యారేజ్ లో నితిన్

Nithin Visits Janata Garage Movie Sets

10:52 AM ON 11th June, 2016 By Mirchi Vilas

Nithin Visits Janata Garage Movie Sets

ఈ మధ్య హీరోల మధ్య సఖ్యత బానే పెరుగుతోంది. అప్పట్లో అగ్ర హీరోలు ఎన్.టి.ఆర్ , ఎ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు ఇలా అందరూ మల్టీ స్టార్ చిత్రాలు చేసినవారే. ఇప్పుడు మల్టీ స్టారర్ అంతగా చేయకపోయినా ఒకరి షూటింగ్ సెట్స్ కి మరొకరు వెళ్లి అభినందనలు తెల్పుకోవడం, ముచ్చట్లాడుకోవడం జరుగుతోంది. అదే క్రమంలో 50కోట్లు క్రాస్ చేసి, అ..ఆ మూవీ సక్సెస్ తో మంచి మూడ్ లో ఉన్న హీరో నితిన్ జనతా గ్యారేజ్ సెట్స్ కి వెళ్లాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో, డైరెక్టర్ కొరటాల శివతో ముచ్చటించాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.


'జనతా గ్యారేజ్ సెట్స్ కు శుక్రవారం వెళ్లాను. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ను కలిశా. ఆయన డ్యాన్స్ చూడటం ఎంతో హ్యాపీగా ఉంది' అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అ..ఆ వంటి మంచి సినిమాని తనకందించిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నితిన్ థాంక్స్ చెప్పాడు.

English summary

Young Hero nithin who was enjoting the success of his recent super hit "A.Aa.." movie and yesterday Nithin visit NTR's Janata Garage Movie set and he posted a selfie with young Tiger Junior NTR and posted in his twitter account.