నిత్యా మీనన్‌ 'లాలి' పాట ...

Nithya Menen Sings Song In 24 Movie

05:12 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Nithya Menen Sings Song In 24 Movie

విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తెలుగు, తమిళ్, మలయాళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నిత్యామీనన్ ఇప్పటికే ప్రతి భాషలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు, కొన్ని చిత్రాలకు పాటలు కూడా పాడి అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. తాజాగా 24 సినిమా కోసం రెహ్మాన్ సారథ్యంలో ఒక పాట పాడేసింది. ఇక ఈ అమ్మడి సంతోషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. సూర్య త్రిపాత్రాభినయంగా నటించిన ఈ సినిమాలో సూర్య సరసన నిత్యామీనన్, సమంత నటించారు. మే 6న తెలుగు, తమిళ్ లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో 'లాలి జో లాలి జో' అనే పాట నిత్యామీనన్ పాడింది. ఎప్పటినుండో నిత్యామీనన్ కు ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతంలో పాడాలనే కోరిక బలంగా ఉండేదట. ఆ కల ఈ సినిమాతో నెరవేరింది.

ఇవి కూడా చదవండి: తన సినిమా చూసి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత

ఇవి కూడా చదవండి: మెగా హీరోల పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

English summary

Actress Nithya Menen do selective movies and she used to say dubbing for her role in the movies she acted. Recently she was acting in Suriya's 24 Movie and in this movie Nithya Menen sings song named Lali Jo..Lali Jo