అతనితో కలిసి జీవించడం కష్టమని విడిపోయా: నిత్యామీనన్

Nithya Menon about her affair

12:03 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

Nithya Menon about her affair

కాస్త హైట్ తక్కువైనా వెయిట్ అయిన నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ తనకు పాత్ర నచ్చితే దాని పరిధి గురించి అసలు ఆలోచించదు. చాలా చిత్రాల్లో రెండో హీరోయిన్ గానూ నటించింది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ కు జంటగా 'ఇరుముగన్' చిత్రంలో, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒక చిత్రంలోనూ నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ సంచలన తారల్లో ఒకరుగా వుంటూ ఏ విషయం గురించి అయినా చాలా బోల్డ్ గా మాట్లాడేస్తుంది. సుదీప్ తో నటించిన 'ముడింజా ఇవనైపిడి' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో ఈ అమ్మడు మాట్లాడుతూ, మంచి కథా చిత్రాలలో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక.

డబ్బు సంపాదించాలని ఆ రంగంలోకి రాలేదు. నాకు పాఠశాలలో చదువుకునే సమయంలోనే పాటల పై ఆసక్తి. స్కూల్ డేస్ లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదానిని. అవే నాకు సినిమా అవకాశాలు కల్పించాయి. తొలిసారిగా నటి టబుకు చెల్లెలిగా నటించా. అందుకు 50 వేలు పారితోషికం ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. నాన్న నాస్తికుడు. అందుకని అమ్మ ఇంట్లో పూజలు చేయడం మానేశారు. నాకు దైవభక్తి మెండు. నాన్న నన్ను గుడికి తీసుకెళ్లేవారు. అయితే నేను దైవ దర్శనం చేసుకుని వచ్చే వరకూ నాన్న గుడి బయట వేచి ఉండేవారు. నాది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనస్తత్వం.

మనసులో అనిపించింది బయటకు చెప్పేస్తా. కొందరు నన్ను అదో మాదిరి అంటుంటారు. అలాంటి మాటలు బాధను కలిగిస్తాయి. షూటింగ్ సమయంలో నా సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయితే పక్కన కూర్చుని ఇతర నటీనటుల నటనను పరిశీలిస్తా. లేదా ధ్యానం చేసుకుంటా అని నిత్య వివరించింది. ఇక ప్రేమ విషయానికి వస్తే కాలేజీ రోజుల్లోనే ఒక వ్యక్తి ప్రేమలో పడ్డా. అయితే ఆ వ్యక్తితో కలిసి జీవించలేనని గ్రహించి విడిపోయా అని చెప్పింది.

English summary

Nithya Menon about her affair