ప్రభాస్‌ ఎవరో నాకు తెలీదు

Nithya Menon About Prabhas Issue

12:05 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Nithya Menon About Prabhas Issue

అలా మొదలైంది, ఇష్క, గుండె జారి గల్లంతయ్యిందే వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి తన నటనతో తనదైన ముద్రవేసుకున్న మలయాళ నటి నిత్యామీనన్‌. అయితే తన మొదటి చిత్రం 'అలా మొదలైంది' రిలీజ్‌ తరువాత నిత్యామీనన్‌ ని మీడియా వారు ప్రభాస్‌ గురించి అడిగితే నాకు తెలీదు అని చెప్పాడమే కాకుండా నాకు చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున మాత్రమే తెలుసని అప్పట్లో చెప్పింది. దీనితో నిత్యామీనన్‌ పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మండి పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ సంఘటన పై నిత్యామీనన్‌ 'ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్‌ కే' లో వివరించింది. నా మొదటి చిత్రం సమయంలో నిజంగా ప్రభాస్‌ ఎవరో నాకు తెలీదు. మీడియా వాళ్ళు కావాలనే నన్ను ఆ ప్రశ్న అడిగారు. దీనితో నాకు తెలీదని చెప్పేశాను అని చెప్పుకొచ్చింది.

English summary

Most Talented heroine who got fame with the films like Ala Modalaindi,Gundejaari Gallantayyinday movies.In an TV interview the presenter asked her about the prabhas issue and then she says that at the starting of her carrer she really does know about Prabhas.So that that's the reason behind she said "I dont know prabhas"