ముమ్ముట్టి కొడుకు కాపురం చెడగొడుతున్న హీరోయిన్ ఎవరు?

Nithya Menon Dulquer Salman Love Affair Rumours

12:14 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Nithya Menon Dulquer Salman Love Affair Rumours

అవునా, అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. అయినా ఈ హీరోయిన్లకు పెళ్లయిన హీరోలే దొరికారా అంటూ నెటిజన్లు కామెంట్స్ వేసేస్తున్నారు. సాధారణంగా చూస్తే, చాలా పొగరైన అమ్మాయిగా గుర్తింపుపొందిన నిత్యామీనన్ చాలా తెలివైన హీరోయిన్ గా కూడా సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకుంది. తన కథల ఎంపిక, నటన, పరిశ్రమలో మెలిగే తీరు దానికి కారణం గా చెబుతారు. అయితే, అలాంటి నిత్యా గురించి కోలీవుడ్ లో దారుణమైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోలీవుడ్ హీరో, ముమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తో ఈ అమ్మడు ప్రేమ వ్యవహారం నడుపుతొందట. దీంతో దుల్కర్ కుటుంబంలో రోజూ గొడవలు జరుగుతున్నాయట. ఇంత జరుగుతున్నా నిత్యా తనకేమీ తెలియనట్లు వ్యవహరిస్తోందని తెగ చెవులు కొరుక్కుంటున్నారు.

ఇంతకీ విషయం ఎలా పొక్కిందంటే, దుల్కర్ తో నిత్యా మూడు సినిమాల్లో నటించింది. ఈ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడ్డారట. పైగా, తెరపై ఈ జంట కెమిస్ట్రీ బాగా పండించిందని, అదే కెమిస్ట్రీని నిజ జీవితంలో కూడా పండిస్తున్నారని ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక దుల్కర్ కు ఇప్పటికే పెళ్లైంది. దీంతో దుల్కర్ భార్యకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందని, ప్రతిరోజూ ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని కోలీవుడ్ టాక్ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, హీరో కాపురంలో నిప్పులు పోసిన నిత్యా అంటూ అక్కడి మీడియా వార్తలు కూడా ప్రచురిస్తోంది. దీనిపై మీడియా నిత్యాను సంప్రదించగా ‘నేను పనిచేసే హీరోలందరితో లింకులు పెట్టడం మామూలైపోయింది. దీని గురించి పట్టించుకోను’ అంటూ రూమర్స్ గా కొట్టిపారేస్తోంది. మరి నిప్పు లేందే పొగ రాదుగా అంటూ సినీ లవర్స్ సైతం కామెంట్స్ పడేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఫోన్ నిముషాల్లో 100% ఛార్జ్!

ఇది కూడా చూడండి: హిమాలయాల్లో హిట్లర్ వెతికిన అదృశ్య నగరం ఇదేనా!

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు మీ పర్స్ లో ఉంటే ఇక అంతా బంగారమే!

English summary

Nithya Menon Dulquer Salman Love Affair Rumours.