మహానటి 'సావిత్రి'గా నిత్యామీనన్

Nithya Menon in great actress Savitri biopic movie

01:20 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Nithya Menon in great actress Savitri biopic movie

నానితో 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రం తెరకెక్కించిన నాగ్ అశ్విన్ త్వరలోనే మహానటి సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నట్లుగా నాగ్ అశ్విన్ చెప్పినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సావిత్రి పాత్రలో బాలీవుడ్ హాట్ నటి విద్యాబాలన్ నటించనుందని గతకొద్ది రోజులుగా వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు. స్క్రిప్ట్ పూర్తయిన తరువాతే నటీనటుల ఎంపిక ఉంటుందనీ చెప్పాడు. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే ఈ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలిసింది. సావిత్రి పాత్ర కోసం మల్లు బ్యూటీ నిత్యామీనన్ నటించనుందని సమాచారం.

అలా మొదలైంది, ఇష్క్, గుండె ఝారి గల్లంతయిందే, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు వంటి చిత్రాల్లో నటించి తన అద్భుత నటనను కనబర్చిన నిత్యా ఈ చిత్రంలో మహానటి సావిత్రిగా నటించబోతుందనే వార్త అందరినీ ఆనందానికి గురి చేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో తన నటనతో ఆకట్టుకోగలిగేది ఒక్క నిత్యా మీనన్ నే కాబట్టి. నిత్యాకున్న టాలెంట్ మారె హీరోయిన్ కి లేదు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే నిజమైతే మాత్రం మహానటి సావిత్రి పాత్రలో నిత్యా ఒదిగిపోవడం ఖాయం.

English summary

Nithya Menon in great actress Savitri biopic movie