బన్నీ కన్నా ఎన్టీఆర్ ఇష్టం: నిత్యా షాకింగ్ కామెంట్స్

Nithya Menon shocking comments about Allu Arjun and Ntr

10:58 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Nithya Menon shocking comments about Allu Arjun and Ntr

పెద్ద కళ్ళను మరింత పెద్దగా చేసి కొర కొర చూస్తూ ఏం కావాలో చెప్పమంటే 'గుండె జారి గల్లంతయ్యిందే' అన్న ఫీలింగ్ తప్పకుండా కలిగి తీరుతుంది నిత్యామీనన్ ను మొదటిసారి చూసిన వాళ్లకి. సినిమాలో టీనేజీ అమ్మాయిగా చేసినా, టీనేజీ అమ్మాయికి అమ్మగా చేసినా ఏ పాత్ర చేసినా ప్రేక్షకుల మీద తన ప్రభావం ఉండేలా చేయడం బహుశా నిత్యాకు ఒక్కదానికే చెల్లిందేమో అని చెప్పాలి. త్వరలో తెలుగులో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడింది. అయితే ఈసందర్బంగా బన్నీ, ఎన్టీఆర్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

'100 డేస్ ఆఫ్ లవ్' సినిమాలో ఓ పాట పాడా. సినిమాలో పాట పాడినందుకు ఎంత తీసుకున్నావు? అని అందరూ నన్ను అడుగుతున్నారు. వాస్తవానికి అందుకోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సరదాగా పాడాను అని నిత్యా చెబుతోంది. ఇక ఈ మూవీలో నా పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉండే పాత్ర అని చెబుతూ, ఈ సినిమా చేస్తున్నంత సేపూ నన్ను నేను చూసుకుంటున్నట్టు అనిపించిందని అంటోంది. ఇక తెలుగులో బన్నీ, ఎన్టీఆర్ లతో చేశారు కదా... వారి గురించి అభిప్రాయం ఏమిటని అడిగితే, ఇద్దరూ ఎనర్జీకి మారు పేరుగా ఉంటారని చెప్పింది. ఎనర్జీ లెవెల్స్ లో వాళ్ళతో పోటీపడడం కష్టమేనని అంది. డ్యాన్సులు ఇద్దరూ చాలా బాగా చేస్తారు. నాకు జూనియర్ డ్యాన్సులంటే ఇష్టం అని నిత్యా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.

English summary

Nithya Menon shocking comments about Allu Arjun and Ntr