స్వామి నిత్యానంద, మాత రంజిత మళ్ళి వెలుగులోకి..

Nithyananda And Ranjitha Visits Srikalahasti Temple

01:20 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Nithyananda And Ranjitha Visits Srikalahasti Temple

వివాదాలకు కేంద్రబిందువైన నిత్యానంద స్వామి తన శిష్యురాలు , మాజీ నటి రంజితతో కలిసి శ్రీకాళహస్తి స్వామి వారిని దర్శించుకున్నారు. తన అనుచరులతో కలిసి ఎటువంటి సమాచారం లేకుండా శ్రీకాళహస్తి వచ్చిన నిత్యానందకు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఒక సరికొత్త గేటప్ లో వచ్చిన నిత్యానందను చూడడానికి భక్తులతో పాటు అలా అధికారులు , పోలీసులు సైతం నిత్యానంద ఆశీర్వాదం కోసం పోటీపడడం ఇక్కడ విస్మయం కలిగించే విషయం . వారిని చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని సైతం నిత్యానంద అనుచరులు అడ్డుకుని వారితో దురుసుగా ప్రవర్తించి వారిని తోసేసారు.

హీరోయిన్ రంజితతో పాటు పలువురితో రాసలీలల వీడియోలు యూట్యూబ్‌లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన సంగతే , అలాంటి నిత్యానందకు ఘన స్వాగతం పలికి మరీ శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబల దర్శనం దగ్గరుండి చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే నిత్యానంద అండ్ కో అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇలా నిత్యానందతో ఫోటోలు , ఆశీర్వాదాలు తీసుకున్న ఆలయ అధికారులు , పోలీసుల పై పలువురు మంది పడుతున్నారు .

నిత్యానంద అండ్ కో చేసిన హడవిడిని ఈ కింది వీడియోల్లో చుడండి..

English summary

Controversial Spiritual Baba Nityananda Visits Srikalahasti Temple in the morning.Nityananda visits along with veteran heroine Ranjita and few of his followers .Many of the people including Temple Officials and Police were taken photos and welcomed him in a Grand Manner.