అందుకే మహేష్ బాబు తో యాక్ట్ చెయ్యను

Nithya rejects offer in Mahesh babu movie  

01:40 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Nithya rejects offer in Mahesh babu movie  

మహేష్‌ ప్రక్కన ఒక్కక్షణం అయినా కనిపించాలని చాలామంది తారలు కలలు కంటుంటారు. అదే హీరోయిన్‌ చాన్సు వస్తే ఎగిరి గంతేస్తారు. ఈ విషయంలో చాలామంది ముంబై హీరోయిన్స్‌ వాళ్ళ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు. కాని ఒక్క హీరోయిన్‌ మాత్రం దీనికి విరుద్ధం అంటుంది. ఎవరో కాదండి అలా మొదలైంది హీరోయిన్‌ నిత్యామీనన్‌.

ఆమెకు మహేష్‌ సరసన నటించే అవకాశం లభించింది. కాని ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించింది. వివరాల్లోకి వెలితే ప్రస్తుతకాలంలో నటన పరంగా కూడా విజయాలను సొంతం చేసుకోవచ్చని అంటుంది నిత్యామీనన్‌. ఇప్పుడున్న హీరోయిన్స్‌ కేవలం గ్లామర్‌ షో తో నెట్టుకువస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తాను మాత్రం ఎప్పటకీ గ్లామరస్‌ పాత్రలు చేయనంటూ మహేష్‌ సినిమాని సైతం రిజక్ట్‌ చేసిందట. ప్రస్తుతం ఈ వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఎందుకు రిజక్ట్‌ చేసిందంటే ఆమెదగ్గర కారణం కూడా ఉందని చెప్పుకొచ్చింది. మహేష్‌బాబు సినిమాలో హీరోయిన్‌ అంటే కేవలం పాటలు, గ్లామర్‌ పాత్రలకే పరిమితం అని తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని తనకు ప్రాధాన్యం లేని సినిమాలు చేయనని సూటిగా చెప్పేసింది. సినిమాలో కధతో పాటు హీరోయిన్‌ పాత్రకి కూడా ప్రాముఖ్యత ఉంటేనే తాను చేస్తానని తేల్చి చెప్పేసింది. తాను ఇప్పటి వరకూ ఇదే పార్ములా పాటించాను ఇక పై కూడా అదే ఫాలో అవుతా అని కరాఖండిగా చెప్పేసింది నిత్యా. మహేష్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలోని ఓ పాత్రకోసం నిత్యామీనన్‌ని సంప్రదించగా దాన్ని సున్నితంగా తిరస్కరించింది ఈ భామ.

కృష్ణ పై మహేష్‌బాబు షాకింగ్ కామెంట్స్

వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన శ్రీమంతుడు తల్లి

మహేష్‌ని కామెంట్‌ చేసిన పవన్‌

English summary

Heroines in any career phase die to take a chance for romancing Mahesh Babu in at least one film. However, there is one heroine and she is Nithya Menon who doesn’t care much on how big her male counterpart may be.