పాపం.. బాబుని ఉతికి ఆరేసిన నీతి ఆయోగ్

Niti Aayog blames ChandraBabu Naidu

11:49 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Niti Aayog blames ChandraBabu Naidu

అవునా, అంటే అవునని తెలుస్తోంది. ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ ఏపీ సీఎం చంద్రబాబు పాలిట ఇబ్బందిగా మారడమే కాదు చీవాట్లు కూడా ఎదుర్కునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే కేంద్రం నుంచి చీవాట్లు తినితినీ నెత్తి బొప్పి కడుతున్నట్లుగా ఉంటే, తాజాగా మరోసారి నీతి ఆయోగ్, బాబు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందట. తప్పుడు లెక్కలు చూపితే ఆకస్మిక తనిఖీలు చేస్తామని హెచ్చరించిందట. అసలు ఏమైందో వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో వెనుకబడిన ఉత్తరాంధ్ర - రాయలసీమల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం 700 కోట్లు ఇచ్చింది. విద్య - ఆరోగ్యం - తాగునీరు వంటివాటికి ఆ నిధులను ఖర్చు చేయాలి.

అయితే.. ఆ నిధులను చంద్రబాబు జిల్లాల కలెక్టర్లకు పంపించగా.. వాటిని ఇతర పనులకు వినియోగించారు. చంద్రబాబు పర్యటనల సమయంలో ఖర్చులు - వేదికల నిర్మాణం.. వేదికలపై కూలర్లు - స్కానర్ల కోసం ఖర్చు పెట్టేశారట. కానీ.. నీతి ఆయోగ్ కు పంపిన నివేదికలో మాత్రం 7000 కోట్లు వెనుక బడిన జిల్లాల్లోనే ఖర్చు చేసినట్లుగా చూపించారట. కానీ.. నీతి ఆయోగ్ ఆ మోసాన్ని పసిగట్టి లెక్కలు తీసేసరికి అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు. దీంతో నీతి ఆయోగ్ నుంచి చీవాట్లు పడుతున్నాయట. వెనుకబడిన ఉత్తరాంధ్ర - రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించడంపై నీతిఆయోగ్ మండిపడింది.

కేంద్రం ఇచ్చిన నిధులన్నీ వెనుకబడిన ప్రాంతాల్లోనే ఖర్చు చేశామంటూ తప్పుడు లెక్కలు చూపించడంపైనా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేసినట్లుగా తెలిసింది. కేంద్రం ఇచ్చిన 700 కోట్లలో కేవలం 8 కోట్లు మాత్రమే వెనుకబడిన జిల్లాలకు ఖర్చు చేసి మిగతాదంతా దారి మళ్లించినట్లు చెబుతున్నారు. దీంతో సీరియస్ అయిన నీతి ఆయోగ్ మళ్లీ సరైన లెక్కలు పంపించాలని చంద్రబాబు సర్కారును ఆదేశించింది. అంతేకాదు.. లెక్కల్లో తేడాలొస్తే తనిఖీల కోసం తామే బృందాలను పంపుతామని కూడా హెచ్చరించింది. మొత్తానికి కేంద్రంలో మద్దత్తు వున్నా, గతంలోని ఎన్ డి ఏ మాదిరిగా బాబుకి పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవని మరోసారి రుజువైంది.

English summary

Niti Aayog blames ChandraBabu Naidu