అబ్బ ! అందరూ అదే అడుగుతున్నారు

Nitya Menon About Her Marriage

10:07 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Nitya Menon About Her Marriage

తన నటనతో కుర్రకారు గుండెల్ని టచ్‌ చేసిన నిత్యామీనన్‌ కు అందం, నటన, గాత్రంలతో పాటూ పొగరు కూడా కాస్త ఎక్కువేనట. అందుకే గతంలో పెళ్లి కన్నా సహజీవనమే మిన్న అంటూ వార్తల్లో కెక్కింది. 'పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ కారణంగా ముక్కూ మొహం తెలియని వాళ్ళను పెళ్ళాడి, ఆ తర్వాత గొడవలు పడుతూ చివరకు విడిపోతున్నారు. అందుకే సహజీవనం బెటరని అన్నాను తప్ప పెళ్లి పై మరో రకమైన అభిప్రాయం కాదు' అంటూ వివరణ కూడా ఇచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక పెళ్లి ఎప్పుడని ఎవరైనా అడిగితే, 'చాలామంది ఇదే అడుగుతున్నారు. నా మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడాలి. అతనితో నా జీవితం బాగుంటుందనే నమ్మకం నాకు కలగాలి. అప్పుడే పెళ్ళి చేసుకుంటాను. అయినా నాకూ, మా కుటుంబ సభ్యులకు లేని తొందర మిగతావారికి ఎందుకు?' అని కొంచెం కఠువు గానే బదులిస్తోంది నిత్యా.

English summary

Most Talented Actress in Film Industry Nitya Menon says about her marriage. Nitya Menon Says that soo many people were asking about her marriage and why they were asking about that .She also says that she will surely says when she found her correct match